విభజన: సుప్రీంకు టిడిపి కేశవ్, అడ్డుకుంటామని టి నేత

విభజనపై కోర్టుకెళ్తామంటే అడ్డుకుంటాం: దయాకర్ రెడ్డి
విభజన తీరు, అన్యాయంపై తమ పార్టీకి చెందిన సీమాంధ్ర నాయకులు న్యాయస్థానాలను ఆశ్రయిస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు కొత్తకోట దయాకర్ రెడ్డి వేరుగా చెప్పారు. అయితే రాష్ట్ర విభజన పైన కోర్టును ఆశ్రయిస్తామంటే మాత్రం అడ్డుకుంటామన్నారు.
అలా ఎవరు చేసినా వారి పైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందేనని పార్టీ అధినేతకు ఫిర్యాదు చేస్తామన్నారు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో తమ ప్రాంతానికి చెందిన పార్టీ నాయకులు ఎవరు కూడా వ్యక్తిగతమంటూ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడలేదని గుర్తు చేశారు.
కాగా, ఈ నెల 25, 26 తేదీల్లో టిడిపి సీమాంధ్ర నాయకులు రాష్ట్రపతి, ప్రధానమంత్రిలను కలిసే అవకాశముంది. వారి అపాయింటుమెంట్‌ను టిడిపి కోరింది. టిడిపి నేతలు రేపు ఢిల్లీకి బయలుదేరే అవకాశముంది.












Click it and Unblock the Notifications