చంద్రబాబుపై పేర్ని పొగడ్తలు - కొత్త లాజిక్ తో టీడీపీ ఆగ్రహావేశాలు?

ఏపీ రాజకీయాల్లో తాజాగా ఓ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. చంద్రబాబు అంటేనే అంతెత్తున లేచే వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని తాజాగా ఆయనపై పొగడ్తలు కురిపించారు. అలా అని వైసీపీని వీడి టీడీపీలోకి వెళ్లేందుకో, లేక రేషన్ బియ్యం కేసు నుంచి తప్పించుకునేందుకో కాదు చంద్రబాబు హుందాతనం ఎలా ఉంటుందో స్వయంగా తెలుసుకున్న పేర్నినాని ఆయన్ను ప్రశంసించారు.

అయితే ఈ విషయంలో సహజంగా చంద్రబాబు పార్టీ టీడీపీ శ్రేణులకు సానుకూలంగా కనిపించాలి కానీ అలా జరగలేదు. దీని వెనుక మరో కారణం ఉంది.

perni nanis appraisal to Chandrababu naidu irks tdp cadre-here is why

బందరులో పేర్ని నాని కుటుంబం నిర్వహిస్తున్న ఓ గోడౌన్ లో పౌరసరఫరాల శాఖ భారీ ఎత్తున రేషన్ బియ్యం స్టోర్ చేసింది. అయితే ఇవి అనుకోకుండా మాయం అయ్యాయి. ఒకటీ రెండూ కాదు ఏకంగా 7 వేల బస్తాలకు పైగా రేషన్ బియ్యం మాయమైంది. ఇందులో తొలుత గుర్తించిన 3500 వేల బస్తాల బియ్యానికి గానూ పరిహారంగా డీడీలు తీసి పేర్ని కుటుంబం ప్రభుత్వానికి కట్టేసింది. అయితే మిగిలిన బియ్యానికి డీడీలు కట్టేలోపు పేర్నికి పోలీసులు నోటీసులు ఇవ్వడం, అరెస్టుకు ప్రయత్నిస్తుండటం, ఆయన కుటుంబ సభ్యులు హైకోర్టుకు వెళ్లి బెయిల్ కోసం ప్రయత్నించడం జరిగిపోయాయి.

ఈ నేపథ్యంలో రేషన్ బియ్యం స్కాంలో ఉన్న పేర్ని నానిని, ఆయన కుటుంబాన్ని ఎందుకు అరెస్టు చేయడం లేదంటూ ప్రభుత్వంపై టీడీపీ అనుకూల మీడియా ఒత్తిడి పెంచుతోంది. ఈ నేపథ్యంలో పేర్ని కుటుంబం పరారీలో ఉందని కూడా వార్తలు వడ్డిస్తోంది. దీనిపై స్పందించిన పేర్ని నాని మీడియా ముందుకు వచ్చారు. తాను ఎక్కడికీ పారిపోలేదన్నారు. అలాగే తన భార్య జయసుధ అరెస్టు విషయంలో చంద్రబాబు వ్యవహారశైలిని ఆయన మెచ్చుకున్నారు. ఈ కేసులో తన భార్య జయసుధ అరెస్టు కోసం ఓ మంత్రి ఎంత ఒత్తిడి తెచ్చినా చంద్రబాబు మాత్రం నో అన్నారని, తద్వారా హుందాగా వ్యవహరించారని పేర్ని ప్రశంసించారు.

అయితే దీనిపై టీడీపీ సానుకూలంగా స్పందించాల్సి ఉంది. కానీ టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు మాత్రం ఈ విషయం వదిలేసి పేర్నికి సీఎంవోలో జరిగిన విషయం ఎలా లీకైందనే ప్రశ్నలు అడగటం మొదలుపెట్టారు. సీఎంవోలో కోవర్టులు ఉన్నారని తాము ఎప్పటి నుంచో చెబుతున్నామని, అయినా చంద్రబాబు పట్టించుకోవడం లేదని గగ్గోలు పెడుతున్నారు. దీంతో ఇప్పుడు పేర్ని చంద్రబాబును పొగిడినందుకు మెచ్చుకోకుండా సీఎంవోలో కోవర్టుల పేరుతో సొంత ప్రభుత్వాన్ని వీరు టార్గెట్ చేయడమేంటన్న చర్చ జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+