కొడాలి నాని పై పేర్ని నాని కీలక వ్యాఖ్యలు - స్కెచ్ వేశారు..!!
మాజీ మంత్రి కొడాలి నాని పై పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేసారు. గెటప్ లో ఎలా కనిపించినా పాదరసం కంటే వేగంగా పని చేస్తారని చెప్పుకొచ్చారు. అమాయకంగా కనిపించే కొడాలి నాని చాలా తెలివి ఉన్న వ్యక్తిగా పేర్కొన్నారు. గుడివాడలో కొడాలిని ఓడించటానికి ఇద్దరు పోటీ పడుతున్నారని, అయిదో సారి గెలిచేందుకు కొడాలి నాని భారీ స్కెచ్ తో సిద్దమయ్యారని పేర్కొన్నారు. చంద్రబాబు కోసమే పవన్ పార్టీ పెట్టారని పేర్ని నాని చెప్పుకొచ్చారు. గుడివాడలో కొడాలి నానికి ఉన్న పట్టు గురించి వివరించారు.
కొడాలి పై పేర్ని నాని వ్యాఖ్యలు : కొడాలి నాని లాంటి డైనమిక్ లీడర్ తనకు మిత్రుడు కావటం సంతోషంగా ఉందన్నారు. ఏదో చదివానని చెప్పుకొనే కొడాలి నాని వైసీపీ ఎమ్మెల్యేల్లోనే తెలివిగల వ్యక్తిగా పేర్కొన్నారు. గుడివాడలో కొడాలి నానిని ఓడిస్తామంటూ ఇద్దరు టికెట్ తన కంటే తనకే అంటూ పోటీ పడుతున్నారని ఎద్దేవా చేసారు. రాష్ట్రంలో జగన్ ఏ విధంగా ప్రజల గుండెల్లో నిలిచారో, అదే విధంగా గుడివాడలో కొడాలి నాని పేరు నిలిచిపోతుందని చెప్పుకొచ్చారు.

ఎవరు పోటీ చేసినా, ఇప్పటికే కొడాలి నాని గుడివాడలో అయిదో సారి గెలచేందుకు అన్నీ సిద్దం చేసుకున్నారని వివరించారు. గుడివాడ బస్ డిపో గ్యారేజీ ని కొడాలి బాగు చేసారని చెప్పారు. పది కోట్లతో గుడివాడ బస్టాండు నిర్మాణానికి టెండర్ పిలవబోతున్నామని, మే 19న సీఎం జగన్ చేతుల మీదుగా శంఖుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు.
రజనీకాంత్ పై కొడాలి ఫైర్ : మాజీ మంత్రి కొడాలి నాని మరోసారి చంద్రబాబు, రజనీకాంత్ పైన విరుచుకుపడ్డారు. ఇద్దరికీ భవిష్యత్ లేదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు మంగళవారం హైదరాబాదు ఆసుపత్రిలో ఉంటే, రజనీకాంత్ చెన్నై హాస్పిటల్ లో ఉంటారని ఎద్దేవా చేసారు. చంద్రబాబు ఒక ఎకరం ల్యాండు కొని మంచి నీటి అవసరాలు తీర్చాడంటే తాను వెళ్ళిపోతానని చెప్పారు.

తనది కూడా మోటారు ఫీల్డని... ముఫ్ఫై బస్సులు తనవి కూడా తిరిగేవని చెప్పుకొచ్చారు. గుడివాడ ఆర్టీసీ బస్టాండు గురించి నకు అవగాహన ఉందన్నారు. పులివెందుల తరువాత 20 కోట్లతో నిర్మాణం చేస్తున్నది గుడివాడ బస్టాండు మాత్రమేనని వివరించారు. చంద్రబాబు, లోకేష్ ఎందుకు కట్టలేదు అంటే మాట్లాడరని ఫైర్ అయ్యారు.
గుడివాడలో సీఎం జగన్ టూర్ : గుడివాడ ప్రజల దాహార్తి తీర్చిన మహానుభావుడు రాజశేఖరరెడ్డి అని కొడాలి నాని పేర్కొన్నారు. ఫ్లైఓవర్ కట్టిన మహానుభావుడు ఎన్టీఆర్ అని చెప్పారు. చంద్రబాబు 14 సంవత్సరాల్లో ఏం ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. గుడివాడలో చక్రాలు, బొంగరాలు 14ఏళ్ళు తిప్పిన చంద్రబాబు ఏం చేయలేకపోయారని కొడాలి నాని ఎద్దేవా చేసారు. టిడ్కో ఇళ్ళు రాజశేఖరరెడ్డి ఇచ్చిన స్ధలంలో కట్టినవేనన్నారు. మంత్రి చేసినా, ఐదోసారి గెలిచినా తన పేరు చరిత్రలో నిలిచిపోతుందని కొడాలి నాని చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications