Budameru Vagu: బుడమేరు వాగులో గల్లంతైన సాఫ్ట్ వేర్ ఉద్యోగి..

కొందరు వద్దన్న పనులు చేసి ప్రాణాల మీదికి తీసుకొచ్చుకుంటారు. తాజాగా ఓ వ్యక్తి ఆ మార్గంలో వెళ్లొద్దని చెప్పినా వినకుండా వెళ్లి ప్రాణాల మీదికి తెచ్చుకున్నాడు. మచిలీపట్నంకు చెందిన కలిదింవి ఫణికుమార్ హైదరాబాద్ లోని ఓ కంపెనీలో సాఫ్ట్ వేరు ఉద్యోగం చేస్తున్నాడు. వినాయకచవితి కావడంతో ఇంటికి వెళ్లాడు. శనివారం ఉదయం గన్నవరంలోని బంధువుల ఇంటికి వెళ్లాడు. సాయంత్రం తిరిగి మచిలీపట్నం బయల్దేరాడు.

అతను కేసరపల్లి- ఉప్పలూరు-కంకిపాడు మీదుగా మచిలీపట్నం వెళ్లాలనుకున్నాడు. అయితే స్థానికులు అటుగా వెళ్లొద్దని.. బుడమేరు వరద ఉందని హెచ్చరించారు. విజయవాడ నుంచి వెళ్లాలని సూచించారు. కానీ ఫణికుమార్ హీరోలాగా.. కేసరపల్లి- ఉప్పలూరు-కంకిపాడు మీదుగా బయల్దేరారు. చివరికి అతను బుడమేరు వాగులో చిక్కుకుపోయాడు. గమనించిన స్థానికులు అతన్ని కాపాడే ప్రయత్నం చేశారు.

Phani Kumar a software employee went missing in Budameru

అయినా కుదరకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. రాత్రి కావడంతో ఫణికుమారును రక్షించేందుకు వీలు కాలేదు.. అయినప్పటికీ వెంటనే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి సమాచారం. అయితే అప్పటికే ఫణికుమారు కారు స్కార్పియో వరదలో కొట్టుకుపోయింది. ఫణి కుమారు కూడా వరదలో కొట్టుకుపోయాడు. వరదలో గల్లంతైన ఫణికుమార్ కోసం ఆదివారం ఉదయం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సెర్చ్ చేస్తున్నారు. పండగకు ఇంటికి వచ్చిన ఫణికుమార్ బుడమేరు వరదలో గల్లంతు అవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనగా ఉన్నారు.

భారీ వర్షాలు విజయవాడను అల్లకల్లోలం చేసింది. భారీ వరదతో విజయవాడ వాసులు తీవ్ర అవస్థలు పడ్డారు. ముఖ్యంగా బుడమేరు వాగు పలు చోట్ల గండి పడడంతో వరద నీరు అంతా విజయవాడలోకి వచ్చింది. దీంతో చాలా మంది వరద నీటిలో చిక్కుకున్నారు. అధికారులు బుడమేరు గండ్లు పూడ్చడంతో విజయవాడలో ఇప్పుడిప్పుడే వరద తగ్గుముఖం పట్టింది. అయితే భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+