విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జీన్స్ వదిలేసి ఓణీల్లో, కాళ్లకు పట్టీలతో గర్ల్స్ (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: జీన్స్, ఇతర ఫ్యాషన్ దుస్తుల్లో కనిపించే అమ్మాయిలు సంప్రదాయ దుస్తుల్ోల మెరిసిపోయారు. ఓణీలు, చేతులకు గాజులు, మెడలో ముత్యాల హారాలు, కాళ్లకు పట్టీలతో యువతులు సందడి చేశారు.

మంగళవారం ఉదయం విశాఖపట్నంలోని ఎఁపిపి కాలనీ ఐఐఎఎం కళాశాలలో నిర్వహిచిన సంప్రదాయ దినోత్సవంలో అమ్మాయిలు తెలుగుదనం ఉట్టిపడేలా ముస్తాబై ఉల్లాసపరిచారు. నోవాటెల్ జనరల్ మేనేజర్ బెల్లంకొండ మాధవ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

మేనేజ్‌మెంట్ విద్యార్థులకు అన్ని అంశాలపై నిశితమైన పరిశీలన అవసరమని మాధవ్ అన్నారు. విద్యార్థుల్లో సంప్రదాయ విలువలు, మన సంస్కృతి విశిష్టత తెలియజేసేలా ఏటా సంప్రదాయ దినోత్సవం నిర్వహిస్తున్నట్లు కళాశాల కార్యదర్సి రవీంద్ర అన్నారు.

ముగ్గులు పెడుతూ...

ముగ్గులు పెడుతూ...

సంప్రదాయ దినోత్సవం సందర్భంగా అమ్మాయిలు సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతూ రాగరంజితమైన ముగ్గులను పోత పోశారు.

చీరల్లో, ఓణీల్లో మెరిసిపోతూ..

చీరల్లో, ఓణీల్లో మెరిసిపోతూ..

సంప్రదాయ దినోత్సవం సందర్భంగా అమ్మాయిలు చీరల్లో, ఓణీల్లో అచ్చ తెలుగు కుందనపు బొమ్మల్లా మెరిసిపోతూ కనిపించారు.

సంప్రదాయ దస్తుల్లో..

సంప్రదాయ దస్తుల్లో..

సంప్రదాయ దుస్తుల్లో, అలంకరణతో మెరిసిపోతూనే అమ్మాయిలు రంగు రంగుల ముగ్గులను పరిచి తెలుగు సంప్రదాయాన్ని కళ్లకు కట్టేలా చేశారు.

నృత్యాలు చేశారు...

నృత్యాలు చేశారు...

కార్యక్రమం అనంతరం అమ్మాయిలు సంప్రదాయ దుస్తుల్లో నృత్యాలు చేశారు. ఇది ప్రేక్షకులను ఇతోధికంగా అలరించింది.

English summary
Girls appeared and danced in traditional outfits during traditional event at Visakhapatnam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X