కెసిఆర్ పచ్చజెండా: స్వల్ప అపశ్రుతి (పిక్చర్స్)

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు గురువారం హైదరాబాదులోని ట్యాంక్‌బండ్‌పై గస్తీ, ట్రాఫిక్ పోలీసు వాహనాలకు పచ్చజెండా ఊపారు. రెండు డిజైన్ల ఇన్నోవా కార్లకు, ఒక డిజైన్ మోటార్ సైకిల్ వాహనాలను ఆయన ప్రారంభించారు.

కాగా, నగరంలో జరిగిన ఈ పోలీసుశాఖ వాహనాల ప్రారంభోత్సవం తర్వాత స్వల్ప అపశృతి చోటు చేసుకుంది. ట్యాంక్‌బండ్‌పై వాహనాలు వరుసగా వెళ్తున్న సమయంలో అందులో ఒక వాహనం ప్రమాదానికి లోనైంది. ముందున్న వాహనం అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో వెనక వస్తున్న వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో వెనక కారు స్వల్పంగా దెబ్బతిన్నది.

ఇదిలావుంటే, హైదరాబాద్ పోలీసులకు కొత్త వాహనాల పంపిణీ సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కార్యక్రమం జరుగుతున్న ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను మళ్లించారు.

పోలీసు వాహనాలు...

పోలీసు వాహనాలు...

హైదరాబాదులో కొత్త గస్తీ, ట్రాఫిక్ పోలీసు వాహనాలు ఇలా ఉన్నాయి. వాటికి ముఖ్యమంత్రి కెసిఆర్ గురువారం ఉదయం పచ్చజెండా ఊపారు.

పచ్చజెండా ఊపిన కెసిఆర్

పచ్చజెండా ఊపిన కెసిఆర్

పోలీసుల కొత్త వాహనాలకు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు పచ్చజెండా ఊపారు. హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులకు ఇవి అందుబాటులో ఉంటాయి.

కెసిఆర్‌తో పాటు...

కెసిఆర్‌తో పాటు...

సైబరాబాద్ పోలీసు కమిషనర్ సివి ఆనంద్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఇలా... రాష్ట్ర మంత్రులు కూడా ఉన్నారు.

కీ ఇస్తూ ఇలా...

కీ ఇస్తూ ఇలా...

పోలీసు ఉన్నతాధికారికి వాహనానికి సంబంధించిన కీని ప్రదానం చేస్తూ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఇలా..

మహేందర్ రెడ్డికి ఇలా...

మహేందర్ రెడ్డికి ఇలా...

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డికి వాహనం ప్రదానం చేస్తూ ఇలా..

కొత్త వాహనంపై తాజాగా...

కొత్త వాహనంపై తాజాగా...

కొత్త వాహనంపై ఓ పోలీసు ఇలా ట్యాంక్ బండ్‌పై సాగుతూ కనిపించాడు. ఉత్సాహంగా పనిచేయడానికి కొత్త వాహనం కూడా కిక్ ఇస్తుంది.

ఇలా పచ్చజెండా....

ఇలా పచ్చజెండా....

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కొత్త పోలీసు వాహనాలకు ఇలా పచ్చజెండా ఊపారు. అవి ట్యాంక్‌బండ్‌పై వరుసగా సాగాయి.

బారు తీరిన వాహనాలు..

బారు తీరిన వాహనాలు..

కొత్త పోలీసు వాహనాలు ట్యాంక్‌బండ్‌పై బారులు తీరాయి. ఈ సందర్భంగా చిన్నపాటి అపశ్రుతి చోటు చేసుకుంది.

టూవీలర్లపై పోలీసులు...

టూవీలర్లపై పోలీసులు...

కొత్త మోటార్ బైక్‌లపై పోలీసులు ఇలా హైదరాబాదులోని ట్యాంక్ బండ్‌పై ట్రయల్ వేశారు. కొత్త, కొత్తగా హైదరాబాద్ పోలీసులు ఇలా..

ట్రాఫిక్ మళ్లింపు...

ట్రాఫిక్ మళ్లింపు...

కొత్త పోలీసు వాహనాల ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా ట్యాంక్ బండ్‌కు ఇరువైపులా ట్రాఫిక్‌ను మళ్లించారు.

ప్రమాదంలో దెబ్బ తిన్న వాహనం

ప్రమాదంలో దెబ్బ తిన్న వాహనం

పోలీసు వాహనాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్వల్ప అపశృతి చోటు చేసుకుంది. ఓ వాహనానికి సడెన్ బ్రేక్ వేయడంతో వెనక వస్తున్న వాహనం ఢీకొట్టింది.

ప్రమాదానికి గురైన వాహనం

ప్రమాదానికి గురైన వాహనం

ప్రమాదానికి గురైన వాహనం హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై ఇలా కనిపించింది. పెద్ద ప్రమాదమేమీ జరగలేదు.

ఇలా దెబ్బ తిన్న కారు...

ఇలా దెబ్బ తిన్న కారు...

ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీకొట్టడంతో వెనక వస్తున్న వాహనం ఇలా దెబ్బ తిన్నది. ప్రమాదం చిన్నదే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+