కారులో కాలి బూడిద: గ్యాస్ కిట్టే మింగింది(పిక్చర్స్)
రాజమండ్రి: గ్యాస్ కిట్టే వ్యక్తి మింగేసింది.తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి దానావాయిపేటలో కారులో మంటలు చెలరేగి ఓ వ్యక్తి సజీవదహనమైన విషయం తెలిసిందే. నారాయణపురానికి చెందిన దాసరి సోమరాజు తన మారుతీ కారులో ఇంటర్నెట్ సెంటర్‌కు వెళ్తుండగా అదుపు తప్పి పక్కనే ఉన్న ముగురు కాలువలోకి దూసుకెళ్లింది.
కారులో ఉన్న ఎల్పీజి కిట్ నుంచి గ్యాస్ లీకై మంటలు చెలరేగాయి. దీంతో కారులో ఉన్న సోమరాజు పూర్తిగా కాలిపోయాడు. వెంటనే ఆస్పత్రికి తరలించినా ఫలితం దక్కలేదు. సక్రమంగా గ్యాస్ కిట్‌ను అమర్చకపోవడం వల్లనే ఈ ప్రమాదం సంభవించినట్లు అనుమానిస్తున్నారు.
అగ్నిమాపకాధికారి ఎ. శేఖర్ ఆ విషయాన్ని ధ్రువీకరించారు. ప్రమాద స్థలాన్ని ఆయన పరిశీలించారు. కారు గోడను ఢీకొనడంతో గ్యాస్ కిట్ కదిలి సిలిండర్ లీకై క్షణాల్లో కారులో వ్యాపించిందని, ఇంజన్ వేడికి కారులో మంటలు రేగాయని ప్రాథమిక విచారణలో తేలింది.

కారులో కాలి బూడిద..
దాసరి సోమరాజు అనే 40 ఏళ్ల వయస్సు గల వ్యాపారి కారులో మంటలు చెలరేగడంతో సజీవ దహనమయ్యాడు.

కారులో కాలి బూడిద
సోమరాజు స్థలాల అమ్మకాలు, కొనుగోళ్లకు మధ్యవర్తిగా వ్యవహరిస్తుంటాడు. అతనికి భార్య మహేశ్వరి, ఇద్దరు పిల్లలు దుర్గాప్రసాద్, పావని ఉన్నారు.

కారులో కాలి బూడిద
సోమరాజు రాజమండ్రిలోని నారాయణపురం ఫ్రెండ్స్ ఎంక్లేవ్ అపార్టుమెంటులో నివసిస్తుంటాడు. వారు రోజుల క్రితం దానవాయిపేట కార్పోరేషన్ బ్యాంకు సమీపంలో ఓ ఇంటర్నెట్ కేఫ్‌ను ఏర్పాటు చేశాడు.

కారులో కాలి బూడిద
బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో స్థలం అమ్మకం విషయంపై తన మారుతీ కారులో కొంతమూరు వెళ్లిన అతను తిరిగి ఒంటి గంట ప్రాంతంలో తిరిగి వస్తుండగా ఓ బాలిక అడ్డు వచ్చింది. కంగారు పడి బాలికను తప్పించే ప్రయత్నంలో కారును గోడకు ఢీకొట్టాడు.

కారులో కాలి బూడిద
ముందు చక్రం మురుగు కాలువలోకి వెళ్లి కారు ఆగిపోయింది. ఈ ప్రమాదంతో కారులో ఉన్న గ్యాస్ కిట్‌కు సంబంధించిన సిలిండర్ లీకై క్షణాల్లో మంటలు వ్యాపించాయి.

కారులో కాలి బూడిద
ఈ ప్రమాదం నెట్ సెంటర్ సమీపంలోనే జరగడంతో అక్కడే ఉన్న సోమరాజు స్నేహితులు కారు వద్దకు వచ్చారు. మంటలు చుట్టుముట్టడంతో ఏమీ చేయలేకపోయారు. వారి కళ్ల ముందు సోమరాజు కాలి బూడిదయ్యాడు.

కారులో కాలి బూడిద
కారు అద్దాలు రాళ్లతో పగులగొట్టి, ఇసుక వేసి నీళ్లు వెదజల్లారు. లోపల తీవ్రంగా కాలిపోయిన సోమరాజును కారు నుంచి బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. అతను మార్గమధ్యంలోనే చనిపోయాడు.












Click it and Unblock the Notifications