రాయల తెలంగాణ హీట్: రంగంలోకి జైపాల్ (పిక్చర్స్)
న్యూఢిల్లీ/ హైదరాబాద్: పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పడుతుందనే విశ్వాసంతో మౌనంగా ఉంటూ వచ్చిన తెలంగాణ నాయకులు రాయల తెలంగాణ ప్రతిపాదన రావడంతో అప్రమత్తయ్యారు. దాంతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. తెలంగాణకు చెందిన అన్ని పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు రాయల తెలంగాణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారు.
తెలంగాణ జెఎసి నేతలు ఢిల్లీ వెళ్లి తమ ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డిని కలిశారు. దీంతో జైపాల్ రెడ్డి రంగం మీదికి రావాల్సి వచ్చింది. తెలంగాణ జెఎసి నేతలు కోదండరామ్ తదితరులు కలిసిన తర్వాత జైపాల్ రెడ్డి సోమవారం రాత్రి హడావిడిగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి రాయల తెలంగాణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ప్రకటన చేశారు.
కాగా, ఇటు హైదరాబాదులోనూ వాతావరణం వేడెక్కింది. తెలంగాణ జర్నలిస్టుల ఫోరం తెలంగాణ అమర వీరుల స్మారక స్థూపం గన్‌పార్కు వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. రాయల తెలంగాణను వ్యతిరేకిస్తూ వారు నినాదాలు చేశారు. కాంగ్రెసు తెలంగాణ నాయకులు పొన్నం ప్రభాకర్, గండ్ర వెంకటరమణా రెడ్డి తదితరులంతా రాయల తెలంగాణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ మూకుమ్మడిగా ప్రకటనలు చేశారు.

జైపాల్ రెడ్డితో కోదండరామ్ ప్రభృతులు
రాయల తెలంగాణ ప్రతిపాదనను వ్యతిరేకించాలని కోరడానికి తెలంగాణ జెఎసి నాయకులు కోదండరామ్ సహా తదితరులు సోమవారం కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డిని కలిశారు.

హడావిడిగా మీడియా సమావేశం..
సిడబ్ల్యుసి ప్రకటన తర్వాత తెలంగాణ విషయంలో ఎస్ జైపాల్ రెడ్డి క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ జెఎసి నేతలు, కాంగ్రెసు తెలంగాణ నేతలు కలిసిన తర్వాత జైపాల్ రెడ్డి సోమవారం రాత్రి హడావిడిగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి రాయల తెలంగాణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ప్రకటన చేశారు.

గండ్ర కూడా వ్యతిరేకమే..
రాయల తెలంగాణ ప్రతిపాదనను ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి వ్యతిరేకించారు. తెలంగాణకు చెందిన ఆయన సోమవారం మీడియా సమావేశంలో రాయల తెలంగాణ ప్రతిపాదన సరైంది కాదని, పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పడుతుందనే నమ్మకం ఉందని చెప్పారు.

తెలంగాణ జర్నలిస్టుల ధర్నా..
రాయల తెలంగాణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ తెలంగాణ జర్నలిస్టుల ఫోరం హైదరాబాదులోని గన్‌పార్క్ వద్ద ధర్నా నిర్వహించింది.

ప్లకార్డుల ప్రదర్శన..
రాయల తెలంగాణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ప్లకార్డులు ప్రదర్శిస్తున్న తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ధర్నా కార్యక్రమంలో తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం నాయకుడు శ్రీనివాస్ గౌడ్‌తో పాటు ఫోరం నేత అల్లం నారాయణ ఇలా.












Click it and Unblock the Notifications