సిటీ ఖాళీ: రోడ్డుపై ఓయు విద్యార్థుల క్రికెట్ (పిక్చర్స్)
హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో సంక్రాంతి పండుగ పూట హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు కొత్త రకం ఆటకు శ్రీకారం చుట్టారు. ప్రజలు సంక్రాంతి పండుగకు ఊళ్లకు తరలిపోవడంతో హైదరాబాద్ రోడ్లు ఖాళీ అయ్యాయి. రోడ్ల మీద ట్రాఫిక్ లేదు.
ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు ఖాళీగా కనిపించిన హైదరాబాదులోని ఖైరతాబాద్ క్రాస్ రోడ్డుపై మంగళవారం క్రికెట్ ఆడడానికి ప్రయత్నించారు. వారిని పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ అస్తిత్వంపై, ఎవరికి చెందుతుందనే విషయంపై చర్చ సాగుతున్న నేపథ్యంలో విద్యార్థులు ఖాళీ అయిన హైదరాబాద్ రోడ్డుపై క్రికెట్ ఆడడానికి ప్రయత్నించారు.
శుక్రవారం నుంచే హైదరాబాదులోని ప్రజలు పల్లెబాట పట్టారు. దీంతో రైళ్లు, బస్సులు నిండిపోయాయి. కష్టాలు పడి ప్రజలు తమ పల్లెపట్టులు చేరుకున్నారు. సంక్రాంతి మంగళవారం కాకుండా బుధవారం జరుపుకోవడంతో ఇంకా హైదరాబాద్ ఖాళీగానే కనిపిస్తోంది.

విద్యార్థుల అరెస్టు
హైదరాబాదులోని ఖైరతాబాద్ క్రాస్ రోడ్డులో క్రికెట్ ఆడడానికి ప్రయత్నించిన ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయు) విద్యార్థులను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.

తెలంగాణ నినాదాలు..
ఖైరతాబాద్ చౌరస్తాలో క్రికెట్ ఆడడానికి ప్రయత్నించిన తమను అరెస్టు చేసిన సమయంలో ఓయు విద్యార్థులు తెలంగాణ నినాదాలు చేశారు.

తోసుకెళ్తున్న పోలీసులు
హైదరాబాదులోని ఖైరతాబాద్ చౌరస్తాలో క్రికెట్ ఆడడానికి ప్రయత్నించిన విద్యార్థులను పోలీసులు తోసుకెళ్లి వ్యాన్‌లోకి ఎక్కించారు.

అరెస్టయిన విద్యార్థులు
హైదరాబాదులోని ఖైరతాబాద్ చౌరస్తాలో క్రికెట్ ఆడడానికి ప్రయత్నించి అరెస్టయిన ఓయు విద్యార్థులు ఇలా పోలీసు వ్యాన్‌లో కనిపించారు.

వ్యాన్‌లో ఎక్కిస్తున్న పోలీసులు..
ఖైరతాబాద్ చౌరస్తాలో క్రికెట్ ఆడడానికి ప్రయత్నించిన విద్యార్థులను అరెస్టు చేసిన పోలీసులు ఇలా వ్యాన్‌లోకి ఎక్కించారు.

క్రికెట్ ఆడడానికి ప్రయత్నిస్తూ..
ప్రజలంతా గ్రామాలకు తరలిపోవడంతో ఇలా ఖాళీగా కనిపించిన ఖైరతాబాద్ చౌరస్తాలో ఓయు విద్యార్థులు క్రికెట్ ఆడడానికి ప్రయత్నించారు.

ఇలా బ్యాట్ పట్టారు..
ఖైరతాబాద్ చౌరస్తాలో క్రికెట్ ఆడడానికి ఓ విద్యార్థి ఇలా బ్యాట్ కూడా పట్టి ఫోజు ఇచ్చాడు. అతన్ని పోలీసులు అడ్డుకోవడానికి ప్రయత్నించారు.

పిల్లలూ బ్యాట్ పట్టారు..
ఓయు విద్యార్థులు ఖైరతాబాద్ చౌరస్తాలో క్రికెట్ ఆడడానికి చేసిన ప్రయత్నంలో పిల్లలు కూడా బ్యాట్ పట్టడానికి ఉత్సాహం ప్రదర్శించారు.
-
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
హైదరాబాద్ లో 'స్నో వరల్డ్'.. మంచులో ఫుల్ ఎంజాయ్.. తక్కువ ధరకే..! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications