Pithapuram Assembly Election 2024 Results LIVE: పిఠాపురంలో పీఠం పవన్ కళ్యాణ్‌దే!!
పిఠాపురం అసెంబ్లీ ఎన్నికల 2024 ఫలితాలు ప్రత్యక్ష ప్రసారాలు: పిఠాపురం ఎన్నికల ఫలితాలు రానే వచ్చాయి. పవన్ ఈ ఫలితాల్లో రికార్డులు బద్దలు కొట్టారు. పిఠాపురం నియోజకవర్గం వర్గంలో పవన్ కళ్యాణ్ భారీ విజయం నమోదు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రమే అత్యధిక మెజారిటీతో విజయం సాధించారు.
పవన్ కళ్యాణ్ తన సమీప ప్రత్యర్థి వంగా గీత పై 70354 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. దీంతో పిఠాపురంలో జనసైనికుల సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఇంటివద్ద ప్రస్తుతం సంబరాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్లోని పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజ్నేవా అభిమానులకు, ప్రజలకు అభివాదం చేసి పవన్ కళ్యాణ్ విజయానికి పిఠాపురం నియోజకవర్గంలో విజయానికి కారణమైన వారికి తన కృతజ్ఞతలు తెలియజేశారు.













Click it and Unblock the Notifications