మద్దతివ్వండి: వనజీవి రామయ్యకు ప్రధాని నరేంద్ర మోడీ లేఖ

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: వనజీవి రామయ్యకు ప్రధాని నరేంద్ర మోడీ లేఖ రాశారు. స్వచ్ఛ భారత్‌ కార్యక్రమం చేపట్టి మూడేళ్లు పూర్తైన సందర్భంగా నిర్వహిస్తున్న స్వచ్ఛతే సేవ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా లేఖలో పేర్కొన్నారు.

ఈ సందర్భంగా కోటి మొక్కల రామయ్య సేవలను ప్రధాని మోడీ ప్రశంసించారు. స్వచ్ఛతే సేవ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలంటూ ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రంగాల ప్రముఖులకు ప్రధాని మోడీ లేఖ రాసిన విషయం తెలిసిందే. వీరిలో తెలుగు సినీ ప్రముఖులూ ఉన్నారు.

PM Modi writes letter to Vanajeevi Ramaiah

సినీ ప్రముఖులు మోహన్ లాల్, అనుష్క శర్మ, అనిల్ కపూర్‌లతో పాటు తెలుగు సినీ ప్రముఖులు రాజమౌళి, ప్రభాస్, మహేష్ బాబు, మోహన్ బాబులకు లేఖలు రాశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Prime Minister Narendra Modi write letter to Vanajeevi Ramaiah on Tuesday over Swachata Hi Seva.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి