Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బాపట్ల కేంద్రీయవిద్యాలయంలో విషవాయువుల లీక్-24 మంది విద్యార్ధులకు అస్వస్థత

ఏపీలోని బాపట్ల కేంద్రీయ విద్యాలయంలో ఓ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. విద్యార్ధులు ల్యాబ్ లో ఉన్న సమయంలో అక్కడ గ్యాస్ లీక్ కావడంతో పొగలు కమ్ముకున్నాయి. ఈ ఘటనలో 24 మంది విద్యార్ధులు ఊపిరాడక విలవిల్లాడారు. అనంతరం వీరిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. కెమిస్ట్రీ ల్యాబ్ లో ప్రయోగాలు చేస్తున్న తరుణంలో ఇలా విషవాయువులు లీక్ అయినట్లు తెలుస్తోంది.

బాపట్ల కేంద్రీయ విద్యాలయంలో ఇవాళ ఎప్పటిలాగే విద్యార్ధులు ల్యాబ్ లో ప్రయోగాలకు వెళ్లారు. అయితే అక్కడ ఉన్న గ్యాస్ లు లీక్ కావడంతో కెమికల్ రియాక్షన్ జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. ఒక్కసారిగా కమ్ముకున్న పొగలతో ఉక్కిరిబిక్కిరైన విద్యార్ధులు బయటికి పరుగులు తీశారు. వెంటనే స్పందించిన స్కూలు సిబ్బంది వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించింది.

poisonous gas leak in bapatla kendriya Vidyalaya lab 24 students hospitalized

బాపట్ల కేంద్రీయ విద్యాలయంలో ప్రమాదంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. ల్యాబ్ లో విద్యార్థులు రకరకాల కెమికల్ మిక్స్ చేసిన సమయంలో ప్రమాదకర వాయువుల విడుదలతో విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులతో మాట్లాడిన సీఎం చంద్రబాబు....పిల్లల ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. విద్యార్థులకు ప్రాణాపాయం లేదని, వైద్య సాయం అందిస్తున్నామని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. పూర్తిగా కోలుకునే వరకు వైద్యుల పర్యవేక్షణలోనే విద్యార్థులను ఉంచాలని సీఎం సూచించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+