YS Jagan Sticker : ఇళ్లపై వైఎస్ జగన్ స్టిక్కర్ ప్లాన్ వెనుక భారీ వ్యూహం..?
ఏపీలో వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్ల పాలనపూర్తి చేసుకుంది. వచ్చే ఏడాది ఎన్నికలు ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు సర్వశక్తులొడ్డుతోంది. ఇందులో భాగంగా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా ఓ ప్రయత్నం మాత్రం చర్చనీయాంశమవుతోంది. అది ఇళ్లపై వైసీపీ అధినేత, సీఎం జగన్ స్టిక్కర్ అంటించడమే. ఈ స్టిక్కర్ ను సంక్షేమ పథకాల లబ్దిదారుల ఇళ్లకే ఎందుకు అంటిస్తున్నారనే దాని వెనుక ఓ బలమైన కారణం ఉందని తెలుస్తోంది.
ఏపీలో ఈ నాలుగేళ్లుగా భారీ ఎత్తున సంక్షేమాన్ని అమలు చేశామని ప్రభుత్వం చెబుతోంది. అదే సమయంలో లబ్ది దారులు కూడా చాలా పథకాలపై సంతృప్తిగానే కనిపిస్తున్నారు. అయితే పలు పథకాల్లో లోపాలు కనిపిస్తున్నా అంతిమంగా వాటిని అందుకుంటున్న వారిలో మాత్రం ప్రభుత్వంపై సానుకూల ధోరణే వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఇలా వైసీపీ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అందుకుంటున్న వీరిని శాశ్వతంగా తమ ఓటర్లుగా మార్చుకునేందుకు వైసీపీ వ్యూహరచన చేస్తోంది.

మా నమ్మకం నువ్వే జగన్, జగనే మా భవిష్యత్తు వంటి పేర్లతో ఇప్పుడు సీఎం జగన్ స్టిక్కర్లను సంక్షేమ పథకాల లబ్దిదారుల ఇళ్లకు అతికించే పనిలో వైసీపీ ప్రజాప్రతినిధులు బిజీగా కనిపిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఫీడ్ బ్యాక్ తీసుకునేందుకే అంటూ మొదలుపెట్టిన జగనన్నే మా భవిష్యత్-మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమంలో భాగంగా వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు సంక్షేమ పథకాల లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి ఈ స్టిక్కర్ అతికించేస్తున్నారు. దీంతో కాదంటే ఎక్కడ పథకాలు ఎగిరిపోతాయన్న భయం వారిలో కనిపిస్తోంది.
ఇదంతా నాణేనికి ఓ ఎత్తయితే.. ఇలా సంక్షేమ పథకాల లబ్దిదారుల ఇళ్లకు జగన్ స్టిక్కర్ అంటించడం వెనుక వైసీపీ భారీ వ్యూహమే రచించినట్లు అర్ధమవుతోంది. ఇలా జగన్ స్టిక్కర్ పెట్టుకున్న ఇళ్లు తమ ఓటర్లుగా శాశ్వతంగా ముద్ర వేయాలనేది వైసీపీ వ్యూహం. స్టిక్కర్ అతికించి లేకపోతే విపక్షాల ఓటర్లుగా ముద్ర వేయాలనేది ఈ వ్యుహంలో భాగం. ఇలా ఓటర్లను సంక్షేమం అందుకుంటున్న వారు, అందుకోని వారుగా విభజించి ఓట్ల పోలరైజేషన్ కు తెర దీయాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా వచ్చే ఎన్నికల నాటికి ఏపీలో మెజారిటీగా ఉన్న పథకాల లబ్దిదారులతో గంపగుత్తగా ఓట్లు వేయించుకోవాలనే వ్యూహం కనిపిస్తోంది. అయితే ఇలా స్టిక్కర్ పెట్టించుకున్న వారిలో ఎంతమంది ఓట్లేస్తారన్న దానిపైనే వైసీపీ సక్సెస్ ఆధారపడనుంది.












Click it and Unblock the Notifications