వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీజ్: అప్పు చెల్లించలేదని ట్రాన్స్‌ట్రాయ్‌కు బ్యాంక్ గట్టి షాక్, 'పోలవరం'పై ఆందోళన

|
Google Oneindia TeluguNews

ఏలూరు: పోలవరం ప్రాజెక్టు ప్రధాన కాంట్రాక్టర్ ట్రాన్స్‌ట్రాయ్‌కు గట్టి షాక్ తగిలింది. ఆ కంపెనీ వాహనాలను బ్యాంకర్లు శుక్రవారం సీజ్ చేశారు. పోలవరం సైట్‌లోని వాహనాలను బ్యాంకర్లు స్వాధీనం చేసుకున్నారు. దేనా బ్యాంకుకు రూ.120 కోట్లు ట్రాన్స్‌ట్రాయ్ బకాయిపడినట్లు తెలిపారు.

మూడేళ్లుగా బకాయిలు చెల్లించకపోవడంతో వాహనాలను సీజ్ చేశారు. వాహనాలను సీజ్ చేసింది దేనా బ్యాంక్ అధికారులు. దేనా బ్యాంక్ నుంచి తీసుకున్న రూ.120 కోట్ల రుణాన్ని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

పవన్‌ను అంత మాట అంటావా: కత్తి మహేష్‌కు దిమ్మతిరిగేలా, తిడుతున్నారంటూ పోస్ట్పవన్‌ను అంత మాట అంటావా: కత్తి మహేష్‌కు దిమ్మతిరిగేలా, తిడుతున్నారంటూ పోస్ట్

కోర్టు ఆదేశాలతో వాహనాలు సీజ్

కోర్టు ఆదేశాలతో వాహనాలు సీజ్

శుక్రవారం పోలవరం వద్ద నున్న ట్రాన్స్‌ట్రాయ్ సంస్థ కార్యాలయానికి దేనా బ్యాంకు ప్రతినిధులు వచ్చారు. వారు కోర్టు ఆదేశాలతోనే తాము వాహనాలు సీజ్‌ చేసేందుకు వచ్చినట్లు తెలిపారు. అయితే వాహనాలు సీజ్ చేసే ప్రయత్నాలు మాత్రమే జరిగాయని కూడా అంటున్నారు.

Recommended Video

Polavaram Project Politics In Ap | Oneindia Telugu
పోలవరం పనుల నిలిపివేతపై ఆందోళన

పోలవరం పనుల నిలిపివేతపై ఆందోళన

ట్రాన్స్‌ట్రాయ్ వాహనాలను సీజ్‌ చేస్తే పోలవరం ప్రాజెక్టు పనులు నిలిచిపోతాయేమోనన్న ఆందోళన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వర్గాల్లో నెలకొంది. అయితే ఇది ట్రాన్స్‌ట్రాయ్‌ సంస్థ ప్రయివేటు వ్యవహారం కావడంతో ప్రభుత్వ అధికారులు ఈ విషయంలో జోక్యం చేసుకోవడం లేదు.

బ్యాంకు అధికారులతో చర్చలు

బ్యాంకు అధికారులతో చర్చలు

సీజ్ నేపథ్యంలో ట్రాన్స్‌టాయ్‌, దేనా బ్యాంక్‌ ప్రతినిధుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. గతంలో ఇచ్చిన నోటీసులకు సంస్థ స్పందించలేదని, అందువల్లే కోర్టు ఆదేశాలతో తాము వాహనాలను సీజ్‌ చేసేందుకు వచ్చినట్లు బ్యాంకు అధికారులు చెబుతున్నారు.బాకీలు కట్టలేదని యంత్రాలను సీజ్ చేశారు. అప్పుపై రూ.36 కోట్ల వడ్డీ పేరుకుపోయింది. రివర్స్ మోర్టగేజ్ కింద వాహనాలను సీజ్ చేశారు.

పోలవరం పనులపై ఆందోళన

పోలవరం పనులపై ఆందోళన

కాగా, ట్రాన్స్‌ట్రాయ్ పైన గతంలోనే కెనరా బ్యాంకు కోర్టుకు ఎక్కింది. ఇప్పుడు దేనా బ్యాంక్ వంతు వచ్చింది. ఈ సంస్థకు ఉన్న అప్పులు, బ్యాంకులు వరుసగా షాకివ్వడం, పనులలో జాప్యం నేపథ్యంలో.. ఈ ప్రభావం పోలవరం ప్రాజెక్టు పనులపై పడుతుందని ప్రభుత్వం ఆందోళనగా ఉంది.

English summary
The Crisis in Polavaram Chief Contractor, Transstroy seems to be blowing out of proportion. We already know that Canara Bank filed a petition before National Company Law Tribunal (NCLT), Hyderabad, urging it to declare M/s Transstroy (India) Ltd as bankrupt and initiate corporate insolvency process against the construction company. Now it is the turn of Dena Bank. The Bank officials have gone to seize the vehicles at Polavaram Site.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X