విశాఖ తీరంలో మసాజ్ చెయ్యమంటే ఏం చేస్తున్నారో తెలుసా ??
మారుతున్న కాలాన్ని బట్టి విలాసవంతమైన జీవితానికి శ్రీమంతులు, యువత అలవాటు పడ్డారు ఆంధ్రప్రదేశ్ లో స్మార్ట్ సిటీ గా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరంలో కూడా మసాజ్ కేంద్రాలు పుట్టగొడుగుల్లా వెలిసాయి. కొన్ని మసాజ్ సెంటర్లలో కస్టమర్లకు మసాజ్ మాత్రమే చేస్తున్నారు. కొన్ని మసాజ్ సెంటర్లలో ఆనైతిక కార్యకలాపాలు జరుగుతున్నాయని చాలా కాలంగా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.
అయితే ఇంతకాలం కొందరు పోలీసు అధికారులు చూసిచూడనట్లు వదిలేశారని, కొందరు పోలీసులు మసాజ్ సెంటర్ ల నిర్వహకుల దగ్గర మామూలు వసూలు చేసి వదిలేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. కొన్ని మసాజ్ సెంటర్లలో మాదకద్రవ్యాలు, అమ్మాయిల అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విశాఖలోని కొన్ని మసాజ్ సెంటర్లపై ఫిర్యాదులు ఎక్కువ అయ్యాయి.

ఈ ప్రాంతంలో ఎప్పుడంటే అప్పుడు ఇతర రాష్ట్రాలకు చెందిన మహిళలు తిరుగుతున్నారని, మేము ఆ ప్రాంతాల్లో సంచరించాలంటే చాలా ఇబ్బందిగా ఉందని స్థానికంగా నివాసం ఉంటున్న ప్రజలు పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు. కొంతకాలంగా విశాఖ నగరంలోని కొన్ని మసాజ్ సెంటర్ల పైన నిఘా వేసిన పోలీసులు సమాచారం సేకరించారు. మంగళవారం రెండు వందల మందికి పైగా పోలీసులు ఏకకాలంలో విశాఖ నగరంలోని చాలా మసాజ్ సెంటర్లపై దాడులు నిర్వహించారు.
కొన్ని గంటలపాటు జరిగిన తనిఖీలలో మసాజ్ సెంటర్లలో అనైతిక కార్యక్రలాపాలు జరుగుతున్నాయని గుర్తించిన పోలీసులు షాక్ అయ్యారు ఇదే సమయంలో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశాఖ నగర పోలీస్ కమిషనర్ కు పూర్తి సమాచారం ఇస్తున్నామని, త్వరలో పూర్తి వివరాలు చెబుతామని పోలీసులు అంటున్నారు. గత రెండేళ్లుగా విశాఖ నగరంలోని పలు మసాజ్ సెంటర్లలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని, ఎన్నిసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని కొన్ని ప్రాంతాల్లో నివాసముంటున్న ప్రజలు ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications