ఫేస్‌బుక్ వేధింపులు: సోదరి ఏటిఎంతో అమ్మాయిలా..

పోలీసుల కథనం ప్రకారం.. వివరాలు ఇలా ఉన్నాయి. అరుణోదయ కాలనీలో నివాసముంటున్న బాధితురాలు, కొత్తపేటలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ చదువుతోంది. కాగా ఆమెకు పదవ తరగతి చదువుతున్న సమయం నుంచే అర్జున్ అనే యువకుడు ఫేస్‌బుక్ ద్వారా పరిచయం అయ్యాడు. అయితే కొంత కాలం నుంచే ఆ అమ్మాయికి తరచూ ఫోన్ కాల్స్ చేస్తూ వేధింపులకు పాల్పడుతున్నాడు.
దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు ఆమెను కళాశాలను మాన్పించివేశారు. అయినా వేధింపులు ఆగకపోవడంతో యువకుడిపై చర్యలు తీసుకోవాలని బాధితురాలి తండ్రి పోలీసులను ఆశ్రయించారు.
అక్క వేషంలో ఏటిఎంలోకి తమ్ముడు
జిల్లాలోని సంగారెడ్డిలో సోమవారం వేకువజామున వింత సంఘటన చోటు చేసుకుంది. సంగారెడ్డి పట్టణానికి ఓ చెందిన యువకుడు అతని సోదరి వద్ద ఏటిఎం కార్డును దొంగిలించి డబ్బులు డ్రా చేసేందుకు ఏటిఎం కేంద్రానికి వెళ్లాడు. అయితే ఏటిఎం కేంద్రంలోని సిసి కెమెరాల్లో తాను కనపడతానేమోనని తన సోదరి దుస్తులను వేసుకుని ముఖం కనబడకుండా అమ్మాయిలా తయారై వచ్చాడు.
ఉదయం 5 గంటలకు జరిగిన ఈ సంఘటనను చూసిన పోలీసులు, అమ్మాయిల ఉండి పల్సర్ బైకును నుడుపుతూ అనుమానాస్పదంగా సంచరిస్తుండడంతో అతన్ని ప్రశ్నించేందుకు ప్రయత్నించారు. అయితే అతను అక్కడి పారిపోయేందుకు యత్నించాడు. దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అతని తల్లిదండ్రులను పిలిచి విచారించగా విషయం బయటపడింది. దీంతో యువకునికి కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు, తల్లిదండ్రులకు అప్పగించారు.












Click it and Unblock the Notifications