టిడిపి అభ్యర్థి వెంకటరమణ ఇంట్లో పోలీసుల సోదాలు

ఇంట్లోని ప్రతీ గదిని అనువనువూ సుదీర్ఘంగా పరిశీలించారు. 2 గంటల వరకు సోదాలు జరగడంతో వెంకటరమణ కుటుంబసభ్యులు ఇబ్బందులకు గురయ్యారు. ఇంట్లో రూ.4.99 లక్షల నగదు లభ్యం కాగా వాటికి ఆధారాలు చూపడంతో అధికారులు వెనుదిరిగారు. మొదట సర్చ్ వారెంట్ ఉందంటూ తనిఖీలు నిర్వహించిన అధికారులు సోదాలు పూర్తి అయిన తర్వాత తమ వద్ద సెర్చ్ వారెంట్ లేదని తెలిపారు. దీంతో వెంకటరమణ నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
సోదాలు చేస్తున్న అధికారుల్లో ఒకరికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతల నుంచి ఫోన్లు రావడంతో వెంకటరమణ అనురులు ఆందోళనకు దిగారు. తిరుపతిలో పోలీసులు, ఎన్నికల వ్యయ పరిశీలకుల తీరుపై టిడిపి నేతలు అనుమానాలు వ్యక్తం చేశారు.
సోదాల వెనుక ఏదో కుట్ర ఉందని వెంకటరమణ విమర్శించారు. ఎవరో చెబితే అధికారులు తనిఖీలు చేసి ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. డబ్బులు పంచుతున్నది వేరే పార్టీ వారు అయితే సోదాలు తమ నివాసాల్లో చేస్తున్నారని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications