పొత్తుల కత్తులకు ఎదురొచ్చే మొనగాడేడి?

కైకలూరు ఇన్ ఛార్జిగా ఉన్న జయమంగళ వెంకటరమణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన పొత్తు పెట్టుకొని పోటీచేయడం ఖాయమైనట్లే. అధికారికంగా ప్రకటించడమే తరువాయి. అనధికారికంగా అయితే రెండు పార్టీల్లోను జనసేనకు కేటాయించే నియోజకవర్గాలపై జోరుగా చర్చ సాగుతోంది. కొన్ని నియోజకవర్గాల్లోని టీడీపీ ఇన్ఛార్జిలు కూడా ఏ నియోజకవర్గం ప్రకటిస్తారో అనే సందిగ్ధావస్థలో కొట్టుమిట్టాడుతున్నారు. తమ నియోజకవర్గం జనసేనకు కేటాయిస్తే తమ పరిస్థితి ఏమిటి? అని ఆలోచిస్తున్నారు.

వైసీపీలో చేరిన జయమంగళ వెంకటరమణ

వైసీపీలో చేరిన జయమంగళ వెంకటరమణ


కైకలూరు ఇన్ ఛార్జిగా ఉన్న జయమంగళ వెంకటరమణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దీనికి కారణమేమీ లేదు.. టీడీపీ-జనసేన పొత్తులో భాగంగా కైకలూరు నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయించే అవకాశం ఉందని ఆయనకు గట్టిగా సమాచారం ఉండటంతో పార్టీ మారారు. వైసీపీ తరఫున ఆయనకు ఎమ్మెల్సీ ఆఫర్ లభించింది. కైకలూరు తరహాల్లో ఇతర నియోజకవర్గాల్లో అసంతృప్తిగా ఉండే నాయకులను వైసీపీలోకి తీసుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది. అయితే ఏయే నియోజకవర్గాలు కేటాయిస్తారనే విషయంలో ఒక స్పష్టత వస్తేకానీ ఎవరు ఏ పార్టీలోకి వెళతారో? ఎవరు ఏ పార్టీలో ఉంటారో అనేది తెలియదు.

పొత్తులో భాగంగా జనసేనకు?

పొత్తులో భాగంగా జనసేనకు?

2014 ఎన్నికల్లో పొత్తులో భాగంగా టీడీపీ ఈ నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించింది. ఇక్కడి నుంచి విజయం సాధించిన కామినేని శ్రీనివాస్ మంత్రిగా పనిచేశారు. బీజేపీతో పొత్తు వికటించిన తర్వాత ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు. 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీకి దిగిన జయమంగళ వెంకటరమణ వైసీపీ నుంచి పోటీచేసిన దూలం నాగేశ్వరరావు చేతిలో పరాజయం పాలయ్యారు. ఈ నియోజకవర్గాన్ని పొత్తులో భాగంగా జనసేనకు కేటాయిస్తే పోటీచేసేది ఎవరన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.

ఒకవైపు వైసీపీ.. మరోవైపు బీజేపీ

ఒకవైపు వైసీపీ.. మరోవైపు బీజేపీ


నియోజకవర్గాల ఇన్ ఛార్జిలు ఎవరైతే అసంతృప్తితో ఉన్నారో వారిని గుర్తించి పార్టీలో చేర్చుకోవడానికి వైసీపీ ప్రయత్నాలు ప్రారంభించింది. మరోవైపు నుంచి భారతీయ జనతాపార్టీ.. తాము కేంద్రంలో అధికారంలో ఉన్నాం కదా.. హామీ మాది అని చెబుతూ పార్టీలోకి ఆహ్వానం పలుకుతున్నారు. గత ఎన్నికల్లో నోటా కన్నా తక్కువగా ఓటింగ్ శాతం నమోదైన బీజేపీలోకి వెళ్లాలా? వద్దా? అనే ఆలోచనలో కొందరు నేతలున్నారు. ఏదేమైనప్పటికీ ఒక పార్టీలో సీటు లేకపోతే మరో పార్టీలోనైనా కచ్చితంగా సీటు దక్కుతుందనే భరోసాతో పార్టీలు మారడానికి నాయకులు సిద్ధమవుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+