టిక్ టాక్ ను ఫుల్‌గా వాడేస్తున్న వైసీపీ! ఆ విషయంలో వెనుకపడ్డ ఇతర రాజకీయ పార్టీలు.

ఏపీ రాజకీయాలు సోషల్ మీడియా వేదికగా చెలరేగిపోతున్నాయి అనడానికి టిక్ టాక్ లో రాజకీయాలపై వస్తున్న వీడియోలు చూస్తే చాలు. టైమింగ్ ను ఉపయోగించుకుని రైమింగ్ తో రెచ్చిపోతున్నారు నెటిజెన్లు. యాక్షన్ చేస్తూ స్టెప్పులు వేస్తూ ఇరగదీస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం జరగనున్న ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియా చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. అయితే టిక్ టాక్ వినియోగంలో మాత్రం టీడీపీతో పోలిస్తే, వైసిపి చాలా ముందుందని అర్థమవుతోంది.

టిక్ టాక్ లో ప్రచారం .. ముందంజలో ఉన్న వైసీపీ

టిక్ టాక్ లో ప్రచారం .. ముందంజలో ఉన్న వైసీపీ

వైసిపి అభిమానుల నుండి పెద్ద ఎత్తున టిక్ టాక్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఒక వీడియోలో ఒక మహిళ టిక్ టాక్ లో చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. మా చంద్రన్న పసుపు కుంకుమ కింద పదివేలు ఇచ్చాడు. చంద్రన్న సెల్ పంపాడు. మరి ఓటెవరికి వేస్తారు అని అడిగితే ఇంకెవరికి జగన్నన్నకు అంటూ సాగే ఈ సంభాషణ నెటిజెన్లను కడుపుబ్బా నవ్విస్తుంది.

వైసీపీకి మద్దతుగా ఒకటి కాదు రెండు కాదు బోలెడు వీడియోలు ..

వైసీపీకి మద్దతుగా ఒకటి కాదు రెండు కాదు బోలెడు వీడియోలు ..

హూ ఇస్ ది నెక్స్ట్ సీఎం అఫ్ ఏపీ అంటూ సాగే ప్రశ్నకు గూగుల్ నుండి సమాధానం వచ్చినట్లుగా వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ ద నెక్స్ట్ సీఎం అఫ్ ఏపీ అంటూ సాగే సంభాషణ కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. బై బై బాబు బై బై పప్పు అంటూ నెటిజన్లు తెగ హడావుడి చేస్తున్నారు. టిక్ టాక్ వేదికగా చెలరేగిపోతున్నారు .అంతేకాదు చాలా వ్యంగ్యంగా, అంతే కామెడీగా టిడిపిపై సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేస్తున్నారు.

టీడీపీపైన సెటైర్లు వేస్తూ సాగే టిక్ టాక్ వీడియోలు .. ఏపీలో హల్ చల్

టీడీపీపైన సెటైర్లు వేస్తూ సాగే టిక్ టాక్ వీడియోలు .. ఏపీలో హల్ చల్

ఒకపక్క టిక్ టాక్ ను నిషేధించాలని తమిళనాడులోని మద్రాసు హైకోర్టు కేంద్రాన్ని కోరిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఈ యాప్ పై చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే ఏపీలో మాత్రం ఎన్నికల నేపథ్యంలో టిక్ టాక్ యాప్ సంచలనంగా మారింది. టిడిపి పై సెటైర్లు వేయడానికి, టిడిపి నేతల డైలాగులతో కామెడీ చేయడానికి, వైసిపి కి మద్దతు తెలపడానికి టిక్ టాక్ యాప్ ను విపరీతంగా వినియోగిస్తున్నారు నెటిజన్లు. ఇక ఈ వీడియోలన్నీ వైరల్ గా మారుతుండడంతో సోషల్ మీడియా ప్రభావం ఈ ఎన్నికల్లో ఏ విధంగా ఉండబోతుందన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+