అమరావతిలో మళ్లీ భూసమీకరణ బూమరాంగ్ ? సర్వే నిపుణుడి హెచ్చరిక..!

అమరావతి రాజధానిలో మరోసారి భూసమీకరణ చేపట్టేందుకు కూటమి సర్కార్ సిద్దమవుతోంది. గతంలో 36 వేల ఎకరాల భూముల్ని రైతుల నుంచి తీసుకున్న ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా 44 వేల ఎకరాలు సేకరిస్తామని చెబుతోంది. అయితే దీనిపై అమరావతిలో గతంలో భూములిచ్చిన రైతుల దగ్గరి నుంచి రాజకీయ పార్టీల వరకూ సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో అమరావతిలో రెండో విడత భూసమీకరణపై గతంలో కూటమి గెలుస్తుందని సర్వే ఇచ్చిన నిపుణుడొకరు కీలక వ్యాఖ్యలు చేశారు.

అమరావతి కోసం 35 వేల ఎకరాలు త్యాగం చేసిన ఫేజ్ 1 రైతులు ఆనందంగా ఉన్నారా? అని ప్రముఖ సర్వే నిపుణుడు ప్రవీణ్ పుల్లట చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇప్పుడు ఫేజ్ 2కి వెళ్తున్నారు.. పైగా రైతులే వచ్చి తీసుకోండి అని ఒత్తిడి చేస్తున్నారట.. ఇది కూటమి సర్కారుకు బూమెరాంగ్ అవుతుందేమో చూసుకోండి! అంటూ ప్రవీణ్ సీఎం చంద్రబాబుకు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు.

poll surveyor Praveen pullata warns Chandrababu regime against Amaravati capital land acquisition

ఏదేమైనా ప్రభుత్వాల మధ్య సామాన్య రైతులు నలిగి నాశనం అవుతున్నారంటూ ప్రవీణ్ పుల్లట కీలక వ్యాఖ్యలు చేసారు. ఇప్పటివరకు అభివృధ్ధి చేసింది ఎంత? అసలు రాజధాని కోసం భూములు నిజంగానే అవసరమా? లేకపోతే అప్పు సంపాదించే వ్యూహంలో భాగమా ?అంటూ కూటమి ప్రభుత్వంపై సర్వే నిపుణుడు ప్రవీణ్ పుల్లట ప్రశ్నల వర్షం కురిపించారు. తద్వారా ప్రభుత్వం ఈసారి అవసరం లేకపోయినా భూసమీకరణకు వెళ్తోందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో ఈ వ్యవహారం రాబోయే రోజుల్లో మరింత రచ్చ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

గత ఎన్నికలకు ముందు అందరి కంటే ముందు కూటమి ఈసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ప్రవీణ్ పుల్లట స్వయంగా పలు సర్వేలు నిర్వహించారు. అలాగే కచ్చితంగా కూటమి గెలిచే స్ధానాలు, ఓడిపోయే సీట్లపైనా అంచనాలు వెల్లడించారు. ఇవన్నీ వాస్తవ పరిస్ధితులకు దగ్గరగా ఉండటంతో ప్రవీణ్ పాపులారిటీ కూడా అంతే స్ధాయిలో పెరిగింది. అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా పలు అంశాలపై ఆయన ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నారు.

Take a Poll

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+