పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వన్ మ్యాన్ షో... బ్రో రివ్యూ

పవర్ స్టార్ వన్ మ్యాన్ షోతో బ్రో బ్లాక్‌బస్టర్ హిట్ అంటున్నారు అభిమానులు. మెగా మామా అల్లుళ్లు పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో మూవీ శుక్రవారం (జులై 28) ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన బ్రో సినిమా మొదటి రివ్యూలు వచ్చేశాయి. శుక్రవారం తెల్లవారుఝాము నుంచే థియేటర్ల దగ్గర పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ సందడి షురూ అయింది. పవన్ వన్ మ్యాన్ షో.. బ్రో బ్లాక్ బస్టర్ హిట్ అంటూ కొందరు ట్విటర్ రివ్యూలు ఇస్తున్నారు. ఈ సినిమా గురించి చాలామంది 3 నుంచి 3.75 రేటింగ్స్ ఇస్తూ ట్వీట్ చేస్తున్నారు.

power star pawan kalyan one man show bro review

ఫస్ట్ హాఫ్ డీసెంట్ గా బాగుందని, ఇంటర్వెల్ అదిరిపోయిందని.. సెకండాఫ్ బాగుందంటూ ఓ అభిమాని ట్వీట్ చేశాడు. పవన్ కల్యాణ్ పవర్ ఫుల్ ఎంట్రీకి అభిమానులంతా ఫిదా అయిపోతున్నారు. సినిమా దర్శకుడు సముద్ర ఖని వింటేజ్ పవన్ కల్యాణ్ ను చూపించడంపై అందరూ ఖుషీ అవుతున్నారు. తమ్ముడు సినిమాలోని లుక్, జల్సా సాంగ్ తో థియేటర్లు దద్దరిల్లుతున్నాయి.

హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని దేవి థియేటర్లో పవర్ స్టార్ అభిమానుల హడావిడి ఓ రేంజ్ లో ఉంది. పవన్ అభిమానులే కాకుండా ప్రతి ఒక్కరూ ఈ సినిమాను ఎంజాయ్ చేస్తారని, పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అంటూ న్యూట్రల్ ఫ్యాన్స్ కూడా ట్వీట్లు చేస్తున్నారు. పవన్ వన్ మ్యాన్ షో అయినప్పటికీ డైలాగులు, స్క్రీన్ ప్లే, తమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అద్భుతమంటున్నారు.

వకీల్ సాబ్, భీమ్లా నాయక్ తర్వాత బ్రో తో హ్యాట్రిక్ హిట్ కొట్టేశాడని ఫ్యాన్స్ ఆనందపడిపోతున్నారు. బ్రో మూవీలో పవన్ చాలా కొత్తగా చూపించారని సినీ విశ్లేషకులు కూడా అంటున్నారు. టైమ్ అనే ఓ భిన్నమైన పాత్రలో పవన్ నటించడం విశేషం. మొదటినుంచి చాలామంది అనుకున్నట్లుగా ఈ సినిమాలో పవన్ ది గెస్ట్ రోల్ కాదని, సినిమా మొత్తం ఉన్నాడని ఫ్యాన్స్ ట్వీట్లు చేస్తున్నారు.

థియేటర్లలో హంగామా చేస్తున్న ఫ్యాన్స్ కు సంబంధించి ఎన్నో వీడియోలు ట్విటర్ లో పోస్ట్ చేస్తున్నారు. స్క్రీన్ ముందు దేవి థియేటర్ యాజమాన్యం సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేశాంటే ఫ్యాన్స్ హంగామా ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నప్పటికీ బ్రో సినిమా ఆడుతున్న థియేటర్లు మాత్రం అభిమానులతో కళకళలాడిపోతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+