వైరల్ వీడియో: ఎమ్మెల్యే ప్రశాంతమ్మకు ఎరుక చెప్పిన చిన్నారి
జరిగేది చెబుతాం.. జరగబోయేది చెబుతాం.. సోది చెబుతామమ్మ.. సోది చెబుతాం అంటూ తిరుమలలో ఓ చిన్నారి కనువిందు చేసింది. అయితే తిరుమల బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతమ్మ చిన్నారి వద్దకు సరదాగా ముచ్చటించారు. చిన్నారి వేశధారణ చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తిరుమల బ్రహ్మోత్సవాల సందర్బంగా ఆ చిన్నారి ఎరుక వేషం వేసి, ఒడిలో బుట్ట పెట్టుకుని, చేతిలో మంత్ర కర్ర పట్టుకుని తన దగ్గరికి వచ్చి ఎరుక చెప్పిందని ఎమ్మెల్యే ప్రశాంతమ్మ తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆమె తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.
జరిగేది చెబుతాం.. జరగబోయేది చెబుతాం
— Vemireddy Prashanthi Reddy (@Prashanthi_VPR) September 30, 2025
సోది చెబుతామమ్మ.. సోది చెబుతాం
తిరుమల బ్రహ్మోత్సవాల సందర్బంగా ఓ చిన్నారి “ఎరుక” వేషం వేసి, ఒడిలో బుట్ట పెట్టుకుని, చేతిలో మంత్రకర్ర పట్టుకుని నా దగ్గరికి వచ్చి ఎరుక చెప్పింది. ఆ చిన్నారి ముద్దుల వేషధారణ, అమాయకమైన మాటలు చూసి నేను నిజంగా… pic.twitter.com/8LVLdE86qw
తిరుమల బ్రహ్మోత్సవాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతమ్మకు ఓ చిన్నారి ఎరుక చెప్పింది. సోదెమ్మ సోదో అంటూ ఒడిలో బుట్ట పెట్టుకుని, చేతిలో మంత్ర కర్ర పట్టుకుని ఎమ్మెల్యే ప్రశాంతమ్మకు ఎరుక చెబుతూ సందడి చేసింది. ఆ చిన్నారి ముద్దుల వేషధారణ, అమాయకమైన మాటలు చూసి తాను మంత్ర ముగ్ధులైనట్లు ఎమ్మెల్యే ప్రశాంతమ్మ తెలిపారు. ఆ పాపతో కొద్ది సేపు ముచ్చటిస్తూ, చిన్నారులపై తనకున్న అపారమైన అనురాగాన్ని మరోసారి గుర్తు చేసుకున్నారు. అలాంటి అమాయకమైన సన్నివేశాలు తనకు ఎల్లప్పుడూ ప్రత్యేకమైన అనుభూతినే ఇస్తాయని తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోను తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.

" జరిగేది చెబుతాం.. జరగబోయేది చెబుతాం సోది చెబుతామమ్మ.. సోది చెబుతాం.. తిరుమల బ్రహ్మోత్సవాల సందర్బంగా ఓ చిన్నారి "ఎరుక" వేషం వేసి, ఒడిలో బుట్ట పెట్టుకుని, చేతిలో మంత్రకర్ర పట్టుకుని నా దగ్గరికి వచ్చి ఎరుక చెప్పింది. ఆ చిన్నారి ముద్దుల వేషధారణ, అమాయకమైన మాటలు చూసి నేను నిజంగా మంత్రముగ్ధులయ్యాను. ఆ పాపతో కొద్ది సేపు ముచ్చటిస్తూ, చిన్నారులపై నాకున్న అపారమైన అనురాగాన్ని మరోసారి గుర్తు చేసుకున్నాను. అలాంటి అమాయకమైన సన్నివేశాలు నాకు ఎల్లప్పుడూ ప్రత్యేకమైన అనుభూతినే ఇస్తాయి" అని ఎక్స్ ఖాతా ద్వారా ఆమె తెలిపారు.












Click it and Unblock the Notifications