రామ్ చరణ్ కు ప్రతిష్టాత్మక పాప్ గోల్డెన్ అవార్డ్.. ఖుషీలో ఫ్యాన్స్!!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కు అంతర్జాతీయంగా మరో ప్రతిష్టాత్మకమైన అవార్డు లభించింది. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమాతో అంతర్జాతీయ ఖ్యాతిని దక్కించుకున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు పాప్ గోల్డెన్ అవార్డ్స్ లో స్థానం దక్కించుకున్నారు. అమెరికాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పాప్ గోల్డెన్ అవార్డ్స్ లో రామ్ చరణ్ కు గోల్డెన్ బాలీవుడ్ యాక్టర్ అవార్డు దక్కింది.
ఇక ఈ విషయాన్ని పాప్ గోల్డెన్ కమిటీ అధికారికంగా వెల్లడించింది. ఈ అవార్డు కోసం రామ్ చరణ్ తేజ్ తో పాటుగా పలువురు బాలీవుడ్ నటీనటులు నామినేషన్స్ లో నిలిచారు. బాలీవుడ్ లో దిగ్గజ నటులైన షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే, అదా శర్మ, విషెస్ బన్సల్, అర్జున్ మాథుర్, రిద్ధి డోగ్రా, రాశి ఖన్నా.. నామినేషన్స్ దక్కించుకోగా రామ్ చరణ్ తేజ్ కు ఈ ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది.

ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డ్ రావడంతో రాం చరణ్ పేరు, జూనియర్ ఎన్టీఆర్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగాయి. ఇక హాలీవుడ్ దిగ్గజ దర్శకులు సైతం వీరి యాక్టింగ్ కు, వీరి డ్యాన్స్ కు ఫిదా అయ్యారు. ఆ తర్వాత వారిరువురూ అనేక అవార్డులు సొంతం చేసుకున్నప్పటికీ, నేషనల్ అవార్డు కూడా వస్తుందని మెగా అభిమానులు భావించారు.
ఆర్ ఆర్ సినిమాలో రామ్ చరణ్ యాక్టింగ్ కు జాతీయ పురస్కారం దక్కుతుందని ఆశపడిన అభిమానులు నిరాశకు గురయ్యారు. నేషనల్ అవార్డు అల్లు అర్జున్ ఖాతాలో పడిన విషయం తెలిసిందే. రామ్ చరణ్ తేజ్ కు నేషనల్ అవార్డు రాలేదని ఆయన వీరాభిమానులు కొంత ఆవేదనకు గురైన విషయం తెలిసిందే.
అయితే ఇప్పుడు మెగా ఫ్యాన్స్ కు శుభవార్త చెప్పారు అమెరికాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పాప్ గోల్డెన్ అవార్డ్స్ నిర్వాహకులు. ఆయనకు అత్యంత ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ బాలీవుడ్ యాక్టర్ అవార్డును ఇస్తున్నట్టు వెల్లడించారు. ఇక ఈ వార్త విన్న ఫ్యాన్స్ తెగ సంబరాలు జరుపుకుంటున్నారు. రామ్ చరణ్ కు పలువురు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.












Click it and Unblock the Notifications