NTR 31లో హీరోయిన్ ఖరారు?

RRR సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ గ్లోబల్ హీరోగా రూపాంతరం చెందాడు. వరుసగా తాను చేసేవన్నీ పాన్ ఇండియా ప్రాజెక్టులే. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న సినిమా పూర్తయిన తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తన 31వ సినిమాను చేయబోతున్నాడు. ఇద్దరు మాస్ ఇమేజ్ ఉన్న వ్యక్తుల కాంబినేషన్ లో పాన్ ఇండియా చిత్రంగా హోంబలే ఫిలింస్ దీన్ని నిర్మించబోతోంది.

ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ సంవత్సరం చివరలో దీన్ని లాంభనం ప్రారంభించబోతున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎన్టీఆర్ సరసన గ్లోబల్ హీరోయిన్ ప్రియాంక చోప్రా నటించబోతోందనేది ఈ వార్త సారాంశం. దీనికి సంబంధించిన నిజనిజాలు తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే. ప్రియాంక హీరోయిన్ గా ఈ సినిమాలో చేస్తే ఈ ప్రాజెక్టు అంతర్జాతీయ ప్రాజెక్టు అవుతుంనడంలో ఎటువంటి సందేహం లేదు.

jrntr

సౌత్ లో ఎన్టీఆర్ ఇమేజ్ పరంగా సినిమాకు బిజినెస్ అవుతుంది. ఎలాగూ RRR సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు కాబట్టి ఆ ఇమేజ్ మీద నార్త్ లో బిజినెస్ నడిచిపోతుంది. ప్రియాంక యాడ్ అయితే ఇతర దేశాల్లో సినిమా మార్కెట్ ను పెంచుకోవాలనేది చిత్ర యూనిట్ ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో రామ్ చరణ్ తో కలిసి తుఫాన్ సినిమాలో ప్రియాంక చోప్రా నటించింది. ఆ తర్వాత మరే తెలుగు హీరోతోను ఆమె నటించలేదు.

తాజాగా హోంబలే ఫిలింస్ అనుకున్నట్లుగా ప్రాజెక్టు సవ్యంగా జరిగితే జూనియర్ సరసన ప్రియాంక చోప్రా నటించడం ఖాయమవుతుంది. NTR 30 చిత్రంలో కథానాయికగా ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తోంది. దక్షిణాదిలో ఆమెకు ఇదే తొలిచిత్రం అవుతుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేయబోతున్నట్లు ఈ సినిమా నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+