నిర్మాత కేపీ చౌదరి డ్రగ్స్ కేసు: దందాలో స్టార్ హీరోయిన్లు, ప్రముఖ డైరెక్టర్!!
గతంలో టాలీవుడ్ డ్రగ్స్ కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మళ్లీ తాజాగా డ్రగ్స్ కేసులో కొకైన్ తో పట్టుబడిన కబాలి నిర్మాత కేపీ చౌదరి అరెస్ట్ నేపథ్యంలో మళ్లీ టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారం తెర మీదకు వచ్చింది. కేపీ చౌదరిని అరెస్టు చేసిన తర్వాత ఆయనను కోర్టు ముందు హాజరుపరచగా కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఆయనను చర్లపల్లి జైలుకు తరలించారు.
కేపీ చౌదరిని అరెస్ట్ చేసిన క్రమంలో పోలీసులు వద్ద నుండి కొకైన్ స్వాధీనం చేసుకోవడంతో పాటు, ఆయన వద్ద ఉన్న నాలుగు సెల్ఫోన్లతో పాటు ల్యాప్ టాప్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి కేపీ చౌదరి డ్రగ్స్ దందా చేస్తున్నట్టు వెల్లడించిన పోలీసులు కేపీ చౌదరికి చాలా మంది టాలీవుడ్ ప్రముఖులు టచ్లో ఉన్నారని గుర్తించారు.

ఈ మేరకు కేపీ చౌదరితో ఉన్న డ్రగ్స్ లింకులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అతని మొబైల్ ఫోన్ డేటా ఆధారంగా ఎవరెవరు అతనితో చాటింగ్ చేశారు అన్నదానిపై పోలీసులు వివరాలు సేకరించి విశ్లేషిస్తున్నారు. ఇక కేపీ చౌదరిని అదుపులోకి తీసుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ కెపి చౌదరిని డ్రగ్స్ వ్యవహారంలో పోలీసులు అరెస్ట్ చేశారు.
గతంలో హీరోయిన్ ఛార్మి, పూరి, రవితేజ, నవదీప్, నందు, తరుణ్, ముమైత్ ఖాన్ వంటి వారిని డ్రగ్స్ లింకుల గురించి పోలీసులు ప్రశ్నించారు. ఇక కేపీ చౌదరితో డ్రగ్స్ లింక్ లపై ఇద్దరు ప్రముఖ హీరోయిన్ ల తో పాటు నలుగురు మహిళా ఆర్టిస్టులు ఉన్నారని పోలీసులు గుర్తించారు. అంతేకాదు ఈ డ్రగ్స్ మాఫియా వెనుక ఒక ప్రముఖ డైరెక్టర్ ఉన్నారని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
కేపీ చౌదరి ఫోన్ ను పూర్తిగా పరిశీలించి ఈ డ్రగ్స్ లింక్స్ లో ఎవరెవరు ఉన్నారో వారి పేర్లు బయటపెడతామని పోలీసులు చెబుతున్నారు. ఏది ఏమైనా టాలీవుడ్ ను షేక్ చేస్తున్న ఈ డ్రగ్స్ వ్యవహారంలో ఉన్న హీరోయిన్లు, ప్రముఖ డైరెక్టర్ ఎవరు అన్నది మాత్రం ప్రస్తుతానికి అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తున్న అంశం.












Click it and Unblock the Notifications