Pulivendula Assembly Election 2024 Results LIVE: జగన్ మెజార్టీ ఎంత - అన్నకు షర్మిల నష్టం చేసిందా..!!
పులివెందుల అసెంబ్లీ ఎన్నికల 2024 ఫలితాలు ప్రత్యక్ష ప్రసారం: ముఖ్యమంత్రి జగన్ మెజార్టీ ఎంత. పులివెందులలో జగన్ హ్యాట్రిక్ విజయానికి చేరువలో ఉన్నారు. కానీ, గతం కంటే పులివెందులలో భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. జగన్ ప్రత్యర్దులు ఏకమయ్యారు. ఈ సారి జగన్ సోదరి షర్మిల కాంగ్రెస్ ఏపీ చీఫ్ గా కడప బరి నుంచి పోటీ చేసారు. పులివెందులలో ఓటింగ్ పైన షర్మిల ప్రభావం ఉందా లేదా అనేది తేలాల్సి ఉంది. 2019లో రాష్ట్రంలో జగన్ అత్యధిక మెజార్టీ సాధించారు. మరి..ఈ సారి అదే రికార్డు కొనసాగిస్తారా...
కొత్త రాజకీయం
పులివెందుల వైఎస్ కుటుంబానికి కంచుకోట. వైఎస్ మరణం తరువాత విజయమ్మ పులివెందుల నుంచి విజయం సాధించారు. జగన్ 2014, 2019 ఎన్నికల్లో వరుసగా పులివెందుల నుంచి గెలుపొందారు. ఈ సారి హ్యాట్రిక్ విజయం పైన కన్నేసారు. జగన్ రెండు సార్లు పులివెందులలో ప్రచార సభల్లో పాల్గొన్నారు. అక్కడ జగన్ తరపు ఎంపీ అవినాశ్ రెడ్డి, సతీమణ భారతి, సతీష్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో జరుగుతున్న హోరా హోరీ పోరులో జగన్ ఇక్కడ భారీ మెజార్టీ లక్ష్యంగా వ్యూహాలు అమలు చేసారు.

జగన్ కు కంచుకోట
జగన్ సోదరి షర్మిల కడప ఎంపీగా పోటీ చేయటంతో...తన పార్టీ అభ్యర్ది అవినాశ్ మెజార్టీ పులివెందులలో ఎక్కువ వచ్చేలా వ్యూహాలు అమలు చేసారు. షర్మిల సైతం పులివెందులలోనే తనకు ఎక్కువ ఓట్లు వచ్చేలా ప్రచారం చేసారు. సునీత సైతం షర్మిలకు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు. ఇక..వైఎస్ కుటుంబానికి ఈ సారి సతీష్ రెడ్డి మద్దతు లభించింది. ఇక..వైఎస్ వివేకా హత్య ప్రధాన అంశంగా షర్మిల -సునీత ప్రచారం కొనసాగించారు. పులివెందులలో టీడీపీ నుంచి బీటెక్ రవి పోటీ చేసారు. ఈ సారి బీటెక్ రవి గట్టి పోటీ ఇస్తున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు.
మరోసారి ఛాన్స్ దక్కేనా
అయితే, ఒక దశలో టీడీపీ, కాంగ్రెస్ కలిసి వైసీపీ ఓటింగ్ తగ్గించే ప్రయత్నాలు చేసారనే వాదన ఉంది. జగన్ తన సొంత జిల్లా కడపలో 2019 ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసారు. ఈ సారి అదే విధంగా అన్నిసీట్లు గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జిల్లాలో తాము సీట్లు గెలుస్తున్నామని టీడీపీ చెబుతోంది. అయితే..పులివెందుల లో జగన్..పిఠాపురంలో పవన్ మెజార్టీ పైన భారీగా బెట్టింగ్స్ జరుగుతున్నాయి. దీంతో పాటుగా పులివెందుల నుంచి గెలిచే జగన్ రెండో సారి ముఖ్యమంత్రి అవుతారనే అంచనాలు నియోజకవర్గంలో ఉన్నాయి. దీంతో..ఎన్నికల ఫలితాల పైన ఇక్కడ ఆసక్తి పెరుగుతోంది.












Click it and Unblock the Notifications