పులివెందుల ప్రొడక్షన్స్ పొలిటికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలు ఇవేనట.. జగన్ ను వదిలిపెట్టని టీడీపీ
ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పై, వైసీపీ ప్రభుత్వంపై ఏ చిన్న అవకాశం దొరికినా తెలుగుదేశం పార్టీ నిత్యం టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. తాజాగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చోటుచేసుకుంటున్న అనేక పరిణామాలను, ఇప్పటివరకు జరిగిన అనేక ఘటనలను టార్గెట్ చేసి పులివెందుల ప్రొడక్షన్స్ సినిమాలు బాగా ఆడాయి అంటూ సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర పోస్ట్ పెట్టింది టిడిపి.

పులివెందుల ప్రొడక్షన్ లో అమ్మ రాజీనామా సినిమా.. నిర్మాత భారతి, డైరెక్టర్ జగన్
తాజాగా వైసీపీ అధినేత జగన్ తల్లి విజయమ్మ గౌరవ అధ్యక్షురాలి పదవికి రాజీనామా చెయ్యటంతో పులివెందుల ప్రొడక్షన్స్ వారి పొలిటికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అమ్మరాజీనామా ఇటీవల విడుదలైంది. ఈ సినిమా బాగా ఆడుతుంది అంటూ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసింది టిడిపి. ఇక అమ్మ రాజీనామా సినిమాకు నిర్మాతగా భారతీ రెడ్డి, దర్శకత్వం జగన్ రెడ్డి, సంగీతం వై వి సుబ్బారెడ్డి, ఎడిటింగ్ సజ్జల రామకృష్ణారెడ్డి, మాటలు విజయసాయిరెడ్డి అందించారని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వేదికగా టార్గెట్ చేసింది.
వివేకానంద హత్యను టార్గెట్ చేసిన టీడీపీ.. వైయస్సాసుర రక్త చరిత్ర , అబ్బాయ్ కిల్డ్ బాబాయ్ సినిమాలు
అంతేకాదు పులివెందుల ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థ గతంలో వైయస్సాసుర రక్త చరిత్ర రాసిందని ఆ సినిమా కూడా బాగానే ప్రేక్షకులను అలరించింది అంటూ వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసును ప్రస్తావిస్తూ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసింది టిడిపి. వైయస్ వివేకానంద రెడ్డి హత్య వైఎస్ కుటుంబమే చేసిందని ఆరోపిస్తున్న టిడిపి వైయస్సాసుర రక్త చరిత్ర సినిమా పులివెందుల ప్రొడక్షన్స్ లో జరిగిందంటూ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. అంతేకాదు అబ్బాయి కిల్డ్ బాబాయ్ అంటూ, అసలు వైయస్ వివేకానంద రెడ్డి హత్యలో జగన్మోహన్ రెడ్డి ప్రధాన భాగస్వామ్యం ఉందని ఆ సినిమా కూడా బాగానే ఆడింది అంటూ పేర్కొంది.

కోడికత్తి దాడిపై కోడికత్తి కహానీ .. వైఎస్ షర్మిల ఇష్యూతో అన్న వదిలేసిన బాణం సినిమాలు
గతంలో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి పై కోడి కత్తి దాడి జరిగినప్పుడు, ఆ దాడి కూడా వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజల సానుభూతి కోసం స్వయంగా చేయించుకున్నారని ఆరోపిస్తూ కోడి కత్తి కహాని సినిమా కూడా బాగానే ఆడిందని తెలుగుదేశం పార్టీ సెటైర్ వేసింది. ఇక జగనన్న వదిలిన బాణంగా వైయస్ షర్మిల ఏపీ రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతగానో పనిచేస్తే అన్న వదిలేసిన బాణంగా ఇప్పుడు మారిందని పేర్కొంటూ అన్న వదిలేసిన బాణం కూడా బాగానే ఆడింది అంటూ వై.సి.పి.లో చోటుచేసుకున్న పరిణామాలను, అనేక ఘటనలను టార్గెట్ చేస్తూ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.

సోషల్ మీడియాలో టీడీపీ పోస్ట్ పై ఆసక్తికర చర్చ
పులివెందుల ప్రొడక్షన్స్ వారి పొలిటికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ "అమ్మ రాజీనామా" ఇటీవల విడుదల అయ్యింది. ఇదే నిర్మాణ సంస్థ వైస్సాసుర రక్త చరిత్ర, కోడికత్తి కహానీ, అబ్బాయ్ కిల్డ్ బాబాయ్, అన్న వదిలేసిన బాణం వంటి విజయంతమైన చిత్రాలు తీసి ప్రేక్షకుల్ని అలరించింది అని పేర్కొన్న టిడిపి అమ్మనీ గెంటేసాడు జగన్ అంటూ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చకు కారణంగా మారింది.
-
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
పట్టు చిక్కుతున్న వేళ చంద్రబాబు చేతికి జగన్ మరో అస్త్రం, సెల్ఫ్ గోల్..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
‘ధురంధర్2’ హిట్ అయినా.. రాబోయే బాక్సాఫీస్ తుఫానులన్నీ తెలుగు సినిమాలవే -
ఓటీటీలో జనాలు ఎగబడి చూస్తున్న సినిమా ఇదే.. మీరు చూశారా? -
మరో సూపర్ కాన్సెప్ట్‌తో వస్తున్న యంగ్ హీరో..థియేటర్లలో రచ్చే..! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి!











Click it and Unblock the Notifications