Punganur Assembly Constituency: రెడ్ల కంచుకోట పుంగనూరు - కాంగ్రెస్-టీడీపీ నుంచి వైసీపీ అడ్డాగా..!
ఏపీలో ఈ మధ్య అసెంబ్లీ సహా ఏ ఎన్నికలు జరిగినా రాయలసీమలో పదే పదే చర్చకొస్తున్న నియోజకవర్గం పుంగనూరు. చిత్తూరు జిల్లాలోని పుంగనూరు నియోజకవర్గం ఈసారి కూడా అసెంబ్లీ ఎన్నికల్లో హాట్ సీటుగా మారనుంది. అయితే ఈ నియోజకవర్గం చరిత్రను గమనిస్తే మొదట్లో కాంగ్రెస్ కంచుకోటగా.. ఆ తర్వాత టీడీపీ అభ్యర్ధులకు అడ్డాగా.. గత పదేళ్లుగా వైసీపీ కంచుకోటగా మారిపోయింది. అయితే నియోజకవర్గంలో రెడ్లు మినహా ఇతర సామాజిక వర్గాలకు గెలిపించే పరిస్దితి లేదు.
ఏపీలోని రాజంపేట లోక్ సభ నియోజకవర్గం పరిధిలో ఉన్న పుంగనూరు నియోజకవర్గం ఆవిర్భావం నుంచీ జనరల్ సీటుగానే ఉంది. పుంగనూరు అసెంబ్లీ పరిధిలో పుంగనూరు, సదుం, సోమల, చౌడేపల్లి, పులిచెర్ల, రొంపిచర్ల మండలాలు ఉంటాయి.ఓటర్ల సంఖ్య 2 లక్షల పైమాటే. కులాల వారీగా చూసుకుంటే రెడ్లు, ముస్లింలు, బలిజ కులాలు ప్రధానంగా ఉంటాయి. మాల, మాదిగ కులాల వారూ ఇక్కడ ఎక్కువగానే ఉన్నారు. అయినా రాజకీయ ఆధిపత్యం మాత్రం రెడ్లదే.

పుంగనూరు అసెంబ్లీ సీటులో ప్రస్తుత మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మూడు సార్లు వరుసగా ఇక్కడ నుంచి గెలిచారు. అలాగే గతంలో నూతనకల్వ రామకృష్ణారెడ్డి మూడు సార్లు , ఆయన కుమారుడు అమరనాధరెడ్డి రెండు సార్లు ఎన్నికయ్యారు.టీడీపీ ఆవిర్భావానికి ముందు జరిగిన ఏడు ఎన్నికల్లో కేవలం 1955లో మాత్రమే ఇండిపెండెంట్ గెలిచారు. మిగిలిన ఆరు సార్లు కాంగ్రెస్సే గెలిచింది. కానీ టీడీపీ ఆవిర్భావం తర్వాత మాత్రం టీడీపీ ఆరుసార్లు, కాంగ్రెస్ రెండుసార్లు మాత్రమే గెలిచింది.
పుంగనూరు సీటులో టీడీపీ 1983, 1985, 1989, 1994, 1996, 2004 ఎన్నికల్లో గెలిచింది. అయితే 2009 నుంచి వరుసగా మూడుసార్లు ( 2009, 2014, 2019)పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇక్కడి నుంచి గెలిచారు. వైసీపీ ఆవిర్భావం తర్వాత రెండుసార్లు (2014, 2019) ఇక్కడ గెలిచింది. ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న పుంగనూరు నియోజకవర్గం ఆ తర్వాత టీడీపీవైపు మొగ్గింది. రాష్ట్ర విభజన తర్వాత మాత్రం వైసీపీకి ఇది అడ్డాగా మారిపోయింది. ఈ ఐదేళ్లలో పెద్దిరెడ్డి ఇక్కడ బలమైన నేతగా ఎదిగారు.
2009 ఎన్నికల్లో 40 వేల మెజార్టీతో గెలిచిన పెద్దిరెడ్డి, 2014లో 31, 731 ఓట్లతోనూ, 2019లో 42, 710 ఓట్ల తేడాతోనూ గెలిచారు.ఈ మూడు ఎన్నికల్లో పెద్దిరెడ్డిపై పోటీ చేసిన అభ్యర్దులంతా మారిపోయారు. ఈసారి కూడా పెద్దిరెడ్డిపై పోటీ చేసి గెలవడం విపక్ష పార్టీలకు అంత సులువు కాదని తెలుస్తోంది. చంద్రబాబు సొంత జిల్లా అయినా టీడీపీ బలహీనంగా మారడంతో పెద్దిరెడ్డిపై గట్టి అభ్యర్ధిని నిలబెట్టేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది.
-
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!!












Click it and Unblock the Notifications