పుంగనూరులో టీడీపీ vs వైసీపీ - మిథున్ రెడ్డి కాన్వాయ్ పై దాడి, వాహనాలు ధ్వంసం..!!
స్థానిక ఎన్నికల వేళ రాజకీయ ఘర్షణలు మొదలయ్యాయి. పుంగనూరులో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. నామినేషన్ల ప్రారంభం రోజునే టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య రాళ్ల దాడులు జరిగాయి. ఒకరి పైన మరొకరు ఆరోపణలు చేస్తున్నారు. రాళ్ల దాడిలో రెండు వైపులా కార్యకర్తలకు గాయాలయ్యాయి. కార్లు ధ్వంసం అయ్యాయి. పోలీసులు వారిని చెదరగొట్టారు. దీంతో, వైసీపీ హై కోర్టును ఆశ్రయించాలని నిర్ణయించింది. ఆన్ లైన్ లో నామినేషన్లకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది.
పుంగనూరులో నామినేషన్ల ప్రారంభం వేళ రాజకీయ ఘర్షణ చోటు చేసుకుంది. ఎంపీ మిథున్ రెడ్డి తమ పార్టీ అభ్యర్దుల నామినేషన్ల కోసం వచ్చారు. ఆ సమయంలో రెండు పార్టీల కేడర్ మధ్య ఒక్క సారిగా ఉద్రిక్తత ఏర్పడింది. మిథున్ రెడ్డి వాహనం పైన రాళ్ల దాడి జరిగింది. ఇటు వైసీపీ శ్రేణులు తిరిగి దాడులు చేసారు. మిథున్ రెడ్డిని అధికారులు నామినేషన్ కేంద్రంలో ఒక గదిలో ఉంచారు. ఆ గదిలోకి తసుకొచ్చేందుకు టీడీపీ శ్రేణులు ప్రయత్నించాయి. దాదాపు గంట సేపుగా నామినేషన్ కేంద్రంగానే మిథున్ రెడ్డి ఉన్నారు. రెండు వైపులా రాళ్ల దాడిలో పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారు. పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మొహరించారు. రెండు వైపులా కార్యకర్తలు తమ పార్టీల అనుకూల నినాదాలతో హోరెత్తిస్తున్నారు.

ఉద్రిక్తత.. హైకోర్టుకు వైసీపీ
వైసీపీ అభ్యర్దులకు మద్దతుగా నామినేషన్ కేంద్రం వద్దకు మిథున్ రెడ్డి రాగానే ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. కాగా.. టీడీపీ, వైసీపీలు ఒకరి పైన ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. రెండు వైపులా కార్యకర్తలు దాడులకు తెగ బడ్డారు. రాళ్ల దాడికి దిగారు. పలువురికి గాయాలు అయ్యాయి. తమను నామినేషన్లు వేయకుండా అధికారాన్ని అడ్డు పెట్టుకొని ప్రయత్నాలు చేస్తున్నారని టీడీపీ పైన వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ పరిణామాల పైన హైకోర్టుకు వెళ్లాలని డిసైడ్ అయ్యారు. కేంద్ర బలగాలను అందుకే తాము కోరుతున్నామని చెబుతున్నారు. ఆన్ లైన్ లో నామినేషన్లు తీసుకోవాలని కోరుతున్నారు. పుంగనూరులో పోలీసులు పరిస్థితిని అదుపు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications
