అరుదైన ఫోటోతో భువనేశ్వరిపై పురందేశ్వరి ప్రేమ.. సీతాదేవితో పోల్చిన హోంమంత్రి వంగలపూడి అనిత
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి పుట్టినరోజు నేడు. భువనేశ్వరి పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీ నేతలు భువనేశ్వరికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరోవైపు భువనేశ్వరి పుట్టినరోజు సందర్భంగా టిడిపి శ్రేణులు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో భువనేశ్వరి జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నారు.
భువనేశ్వరికి పురందేశ్వరి స్పెషల్ విషెస్
ఇదిలా ఉంటే సోషల్ మీడియా వేదికగానూ భువనేశ్వరికి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువ గా మారాయి. గతానికి భిన్నంగా ఈసారి భువనేశ్వరి పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ గా కొందరి శుభాకాంక్షలు కనిపించడం ఆసక్తిని కలిగిస్తుంది. నారా భువనేశ్వరి పుట్టినరోజు సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, అంతకు మించి భువనేశ్వరి సోదరి దగ్గుబాటి పురందేశ్వరి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఓ అరుదైన ఫోటోను ట్వీట్ చేశారు.

Sending the happiest of birthday wishes to Smt. Bhuvaneswari! May her life be filled with endless happiness, good health, and pure joy. 💐@ManagingTrustee pic.twitter.com/5bqWWBJVqW
— Daggubati Purandeswari 🇮🇳 (@PurandeswariBJP) June 20, 2024
రేర్ ఫోటో షేర్ చేసి.. ప్రేమపూర్వక పోస్ట్
సంతోషకరమైన పుట్టినరోజు శుభాకాంక్షలను పంపుతున్నానని, భువనేశ్వరి జీవితం అంతులేని ఆనందంతో, మంచి ఆరోగ్యంతో స్వచ్ఛంగా, జాయ్ ఫుల్ గా కొనసాగాలని కోరుకుంటున్నాను అని పురందేశ్వరి ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ లో అక్కాచెల్లెళ్ళు సంతోషంగా ఒకరికొకరు, దగ్గరగా కూర్చుని సరదాగా దిగిన ఫోటో అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇక ఈ పోస్ట్ చూసిన వారంతా మళ్లీ అక్కాచెల్లెళ్లు విభేదాలు మరిచిపోయి కలిసిపోయారని సంతోషంగా ఉందని ట్వీట్ చేస్తున్నారు.
సీతాదేవికి తీసిపోని భువనమ్మ
మరోవైపు ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత కూడా నారా భువనేశ్వరికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి మరియు ఆనాటి అసురపాలకులతో అవమానం పొంది, అగ్నిపుత్రిగా చరిత్రలో నిలిచి, స్త్రీ జాతికే వన్నెతెచ్చిన సీతాదేవికి ఏమాత్రం తీసిపోని మా అమ్మ భువనేశ్వరి గారి పుట్టినరోజు సందర్భంగా వారికి ఇవే మా జన్మదిన శుభాకాంక్షలు అంటూ పేర్కొన్నారు.
హోం మంత్రి వంగలపూడి అనిత పోస్ట్
ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పెట్టిన పోస్టులో మంత్రి వంగలపూడి అనిత భువనేశ్వరి గత వైసిపి పాలనలో ఎన్నో అవమానాలను భరించారని అగ్ని ప్రవేశం చేసిన సీతాదేవికి ఆమె ఏమాత్రం తీసిపోరన్నారు. హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత పెట్టిన పోస్ట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది..












Click it and Unblock the Notifications