పొత్తు ప్రశ్నార్థకమే: టీడీపీ మైత్రిపై పురంధేశ్వరి, మాణిక్యాల రావుతో శివారెడ్డి భేటీ

Subscribe to Oneindia Telugu

అనంతపురం: తెలుగుదేశం పార్టీతో మితృత్వం ప్రస్తుతానికి కొనసాగుతుందని భారతీయ జనతా పార్టీ నేత దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. అయితే, వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదని చెప్పారు. ఆమె వ్యాఖ్యలతో టీడీపీతో పొత్తు ఉంటుందా? లేదా? అనేది సందేహాస్పదంగా మారింది.

రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయడమే తమ ప్రస్తుత లక్ష్యమని పురంధేశ్వరి స్పష్టం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తండ్రి స్థానంలో ఉందని రాష్ట్ర అభివృద్ధికి ఎన్ని నిధులైనా ఇస్తుందని పురంధేశ్వరి చెప్పారు.

purandeswari on TDP alliance

మంత్రి మాణిక్యాల రావును కలిసిన శివారెడ్డి

రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావును సినీ నటుడు, మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి శుక్రవారం కలిశారు. వెలగపూడి సచివాలయానికి చేరుకున్న శివారెడ్డి మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా వీరిద్దరి మధ్య ఆయా అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
BJP senior leader Purandeswari on Friday responded on TDP alliance in next elections.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి