Cyclone Montha: ఇవాళ, రేపు పలు ప్రధాన రైళ్లు రద్దు - జాబితా ఇదే..!!

తుఫాన్‌ మొంథా బీభత్సం సృష్టించింది. తీర ప్రాంత జిల్లాలను వణికించింది. అర్ధరాత్రి తర్వాత తీరం దాటింది. ఈ సమయంలో 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచాయి. అప్పుడప్పుడు వాయువేగం 110 కిలోమీటర్లకూ చేరింది. ఈ ప్రభావంతో పలు జిల్లాల్లో ఈ రోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో.. రైల్వే అధికారులు ఇవాళ.. రేపు పలు ప్రధాన రైళ్లను రద్దు చేసారు. మరి కొన్ని దారి మళ్లించారు. ముందస్తు రిజర్వేషన్ చేయించు కున్న ప్రయాణీకులకు మెసేజ్ ల ద్వారా సమాచారం అందిస్తున్నారు.

తుఫాను తీరం దాటింది. దీని ప్రభావంతో బుధవారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. రైల్వేశాఖ ముందస్తుగా కోస్తా ప్రాంతాల జిల్లాలకు వెళ్లే పలు రైళ్లు రద్దు చేసింది. ఇవాళ, రేపు నడిచే 107 రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. విజయవాడ, రాజమహేంద్రవరం, విశాఖ, గుంటూరు మీదుగా నడిచే పలు రైళ్లు రద్దు చేశారు. భారీ వర్షాలతో వాల్తేరు రైల్వే డివిజన్‌ మార్గాల్లో నడిచే పలు రైళ్లను మూడు రోజులపాటు అధికారులు రద్దు చేశారు. ఈ క్రమంలో అక్టోబర్‌ 28న విశాఖ నుంచి బయలుదేరాల్సిన 12727 విశాఖపట్నం - హైదరాబాద్‌ గోదావరి ఎక్స్‌ప్రెస్‌, 22203 విశాఖపట్నం - సికింద్రాబాద్‌ దురంతో ఎక్స్‌ప్రెస్‌, 20811 విశాఖపట్నం - నాందేడ్‌ ఎక్స్‌ప్రెస్‌, 12739 విశాఖపట్నం - సికింద్రాబాద్‌ గరీబ్‌ రథ్‌ ఎక్స్‌ప్రెస్‌ రెండు రోజులు రద్దు చేసారు.

railway-cancels-many-trains-for-two-days-due-to-cyclone-in-telugu-states-list-here

అదే విధంగా 20805 విశాఖపట్నం - న్యూ ఢిల్లీ ఎపి సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌, 17220 విశాఖపట్నం - మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌, 18519 విశాఖపట్నం ఎల్‌టిటి ఎక్స్‌ప్రెస్‌, 12861 విశాఖపట్నం - మహబూబ్‌నగర్‌ ఎక్స్‌ప్రెస్‌, 18515 విశాఖపట్నం - కిరండూల్‌ నైట్‌ ఎక్స్‌ప్రెస్‌, 17244 రాయగడ - గుంటూరు ఎక్స్‌ప్రెస్‌ (రాయగడ నుండి), 11020 భువనేశ్వర్‌ - ముంబై కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ (భువనేశ్వర్‌ నుండి), 12806 లింగంపల్లి - విశాఖపట్నం జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ (లింగంపల్లి నుండి), 18046 హైదరాబాద్‌ - శాలిమార్‌ ఈస్ట్‌ కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ (హైదరాబాద్‌ నుండి), 17016 సికింద్రాబాద్‌ - భువనేశ్వర్‌ విశాఖ ఎక్స్‌ప్రెస్‌ (సికింద్రాబాద్‌ నుండి), 12704 సికింద్రాబాద్‌ - హౌరా ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ (సికింద్రాబాద్‌ నుండి), 17243 గుంటూరు - రాయగడ ఎక్స్‌ప్రెస్‌ (గుంటూరు నుండి), 07165 హైదరాబాద్‌-భువనేశ్వర్‌ స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ (హైదరాబాద్‌ నుండి), 17480 తిరుపతి - పూరీ ఎక్స్‌ప్రెస్‌ (తిరుపతి నుండి), 18522 కడప - విశాఖపట్నం తిరుమల ఎక్స్‌ప్రెస్‌ (కడప నుండి) రద్దయ్యాయి.

ఇక, ఈ రోజున (29వ తేదీ) 17220 విశాఖపట్నం - మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌, 18516 కిరండూల్‌ - విశాఖపట్నం నైట్‌ ఎక్స్‌ప్రెస్‌, 17244 రాయగడ - గుంటూరు ఎక్స్‌ప్రెస్‌, 07166 భువనేశ్వర్‌ - హైదరాబాద్‌ స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌, అక్టోబర్‌ 30న 18520 లోకమాన్య తిలక్‌ టెర్మినల్‌ - విశాఖపట్నం ఎల్‌టిటి ఎక్స్‌ప్రెస్‌, 11019 సిఎస్‌టి ముంబై - భువనేశ్వర్‌ కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌, 17479 పూరీ - తిరుపతి ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రయాణీకులకు సమాచారం కోసం హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేసారు. పరిస్థితులకు అనుగుణంగా రైళ్ల పునరుద్దరణ పైన నిర్ణయం తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+