తిరుపతికి వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!!

తిరుమలకు వెళ్లే భక్తులకు వందే భారత్ స్లీపర్ అందుబాటులోకి రానుంది. తెలుగు రాష్ట్రాల్లో వందే భారత్ రైళ్లకు ఆదరణ కనిపిస్తోంది. ఎంపీల నుంచి వస్తున్న డిమాండ్ల మేరకు కొత్తగా వందే భారత్ రైళ్లను తెలుగు రాష్ట్రాల నుంచి నడిపే అంశం పైన రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా ఇప్పుడు కొత్తగా తీసుకొస్తున్న వందేభారత్ స్లీపర్ రైలును విశాఖ నుంచి తిరుపతికి నడిపే ప్రతిపాదన పైన కసరత్తు దాదాపు పూర్తయింది. దీని పైన అధికారులు రైల్వే శాఖకు ఇప్పటికే ప్రతిపాదనలు సమర్పించారు.

విశాఖ టు తిరుపతి
విశాఖ నుంచి వందేభారత్ రైళ్ల సంఖ్య పెంపు కోసం రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే విశాఖ నుంచి నాలుగు వందేభారత్‌ రైళ్లు నడుస్తున్నాయి. విశాఖపట్నం-సికింద్రాబాద్‌ మధ్య రెండు, భువనేశ్వర్‌కు ఒకటి, దుర్గ్‌కు కొనసాగుతున్నాయి. కొత్తగా విశాఖ నుంచి తిరుపతి, బెంగళూరు కు కొత్తగా వందేభారత్ అందుబాటులోకి తీసుకురావాలని రైల్వే మంత్రికి ఎంపీల నుంచి ప్రతిపాదన లు అందాయి. వీటిని అధ్యయనం చేయాలని అధికారులకు రైల్వే శాఖ సూచించింది. అయితే, దూరం ప్రయాణం కారణంగా ఈ మార్గాల్లో వందేభారత్ స్లీపర్ ప్రవేశ పెట్టాలని అధికారులు తాజాగా ప్రతిపాదించారు.

Railway officials submits reports over launch Vandebharat sleeper between Viskaha to Tirupati

తొలి ప్రాధాన్యత
ఈ ప్రతిపాదనల పైన రైల్వే బోర్డు సానుకూలంగా స్పందించింది. కొత్తగా సిద్దం అవుతున్న వందే భారత్ స్లీపర్ రైళ్లను విశాఖ నుంచి ప్రారంభించేందుకు అంగీకరించారు. దేశ వ్యాప్తంగా ఉన్న డిమాండ్ కారణంగా ప్రస్తుతం ఒక వందేభారత్ స్లీపర్ ను విశాఖ నుంచి తిరుపతికి ప్రారంభించేలా అంగీకరించినట్లు తెలుస్తోంది. విశాఖ - తిరుపతి మధ్య దూరం ఎక్కువ కావటంతో 160 కిమీ వేగం తో పాటుగా ఆధునిక టెక్నాలజీతో విలాసవంతమైన సౌకర్యాలతో రూపొందిస్తున్న వందేభారత్ స్లీపర్ ను ఈ మార్గంలో నడిపేందుకు రైల్వే శాఖ ముందుకు వచ్చింది.

రూట్ - షెడ్యూల్
ఈ రైలు ఏర్పాటు ద్వారా విశాఖ - తిరుపతి మార్గంలో నడిచే ఇతర ప్రధాన రైళ్ల పైన ఒత్తిడి తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రతి రైలులో 16 కోచ్‌లు, 832 నుంచి 1,128 వరకూ బెర్తులు ఉంటాయి. జనవరిలో ఈ రైలు పట్టాలు ఎక్కే అవకాశం ఉంది. ఇందులో టిక్కెట్‌ ధర రాజధాని ఎక్స్‌ప్రెస్‌ రేట్లతో సమానంగా ఉంటుంది. ప్రస్తుతం విశాఖ - తిరుపతి సూపర్ ఫాస్ట్ రైళ్లు నడుస్తున్న మార్గంలోనే రాజమండ్రి, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు మీదుగా రాత్రి సమయాల్లో ఈ వందేభారత్ స్లీపర్ కొనసాగేలా అధికారులు తుది షెడ్యూల్ ఫిక్స్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+