Prashanti Express: ప్రశాంతి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు గుడ్ న్యూస్-ఇకపై ఇలా..!
భువనేశ్వర్ నుంచి బెంగళూరుకు ఆంధ్రప్రదేశ్ మీదుగా రాకపోకలు సాగించే ప్రశాంతి ఎక్స్ ప్రెస్ (Prashanti Express)ప్రయాణికులకు కేంద్రం ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం వందే భారత్ ఎక్స్ ప్రెస్, వందే భారత్ స్లీపర్, అమృత్ భారత్ వంటి ప్రీమియం రైళ్లను నిర్వహిస్తున్న తరహాలోనే ఇతర దూర ప్రాంత ప్రయాణాలు చేస్తున్న రైళ్లను సైతం పరిశుభ్రంగా ఉంచాలని, సౌకర్యాలను మెరుగుపర్చాలని కేంద్రం తాజాగా నిర్ణయించింది. ఇందులో తొలిదశ సంస్కరణలకు ప్రశాంతి ఎక్స్ ప్రెస్ ఎంపికైంది.
ప్రశాంతి ఎక్స్ ప్రెస్ కు గుడ్ న్యూస్ (prashanti express)
'బెటర్ ఆన్ బోర్డ్ సర్వీసెస్' పేరుతో రైల్వే చేపడుతున్న సంస్కరణల్లో భాగంగా రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్వరాష్ట్రమైన ఒడిశా రాజధాని భువనేశ్వర్ నుంచి ఏపీ మీదుగా బెంగళూరుకు రాకపోకలు సాగించే ప్రశాంతి ఎక్స్ ప్రెస్ లో ఈ మార్పులు చేపట్టబోతున్నారు. ప్రశాంతి ఎక్స్ ప్రెస్ తో పాటు తూర్పు కోస్తా రైల్వే పరిధిలోని మొత్తం ఆరు రైళ్లలో ఇలా తాజా సంస్కరణలు చేపట్టనున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. ఈ మేరకు తూర్పు కోస్తా రైల్వేకు సమాచారమిచ్చింది.

పరిశుభ్రంగా అన్ని కోచ్ లు
కేంద్రం చేపట్టే ఈ కొత్త కార్యక్రమంలో భాగంగా ప్రశాంతి ఎక్స్ ప్రెస్ లోని జనరల్ కోచ్ లతో పాటు ఇతర అన్ని కోచ్ లనూ పరిశుభ్రంగా ఉంచడంతో పాటు వీటిలో ప్రయాణికులకు అందించే సౌకర్యాలను కూడా మెరుగుపర్చబోతున్నారు. దీంతో ఇకపై మూడు రాష్ట్రాల మీదుగా రాకపోకలు సాగిస్తున్న ప్రశాంతి ఎక్స్ ప్రెస్ లో ప్రయాణికులకు మంచి ప్రయాణ అనుభవం లభిస్తుందని తూర్పు కోస్తా రైల్వే అంచనా వేస్తోంది.

తొలి దశలో ఇలా..
వచ్చే ఏడాది కాలంలో అంటే 52 వారాల్లో ఇలా ఎంపిక చేసిన రైళ్లలో 52 సంస్కరణలు చేపట్టనున్నట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తాజాగా ప్రకటించారు. తొలి దశలో భాగంగా వచ్చే ఆరు నెలల్లో 80 దూర ప్రాంత, రద్దీగా నడిచే రైళ్లను ఇందుకోసం ఎంపిక చేశారు. వచ్చే మూడేళ్లలో ఈ సంస్కరణల్ని దేశవ్యాప్తంగా అన్ని రైళ్లకు విస్తరిస్తారు. గతంలో రిజర్వుడ్ కోచ్ లను మాత్రమే ఎంపిక చేసిన స్టేషన్లలో మాత్రమే ఇలా క్లీన్ చేసేవారు. కానీ ఇప్పుడు నిరంతరాయంగా అన్ని కోచ్ లలోనూ చేపట్టబోతున్నారు. త్వరలోనే ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతోంది.
-
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!!












Click it and Unblock the Notifications