Railway update: ఎక్కాల్సిన స్టేషన్లో కాకుండా తర్వాత స్టేషన్లో రైలెక్కితే మీ బెర్త్ గోవిందా!!

భారతీయ రైల్వేలు.. దేశంలోని కోట్లాది మంది ప్రజలకు అత్యంత సౌకర్యవంతమైన రవాణా మార్గం. భారతదేశంలో సుదూర ప్రయాణాలు చేయాలనుకునే అన్నివర్గాల వారికి రైల్వేను మించిన సుఖవంతమైన ప్రయాణం మరొకటి ఉండదు అని చెప్పడం నిర్వివాదాంశం. రిజర్వేషన్ చేయించుకుని సంబంధిత స్టేషన్లో రైలు ఎక్కి మనం అనుకున్న చోటికి సుఖంగా ప్రయాణం చేయవచ్చు. భారతీయ రైల్వే నిత్యం ప్రయాణికుల కోసం అనేక మార్పులు చేర్పులు చేస్తూ ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణఅనుభూతిని కలిగిస్తుంది.

అయితే రైల్వే నిబంధనలలో చోటు చేసుకుంటున్న మార్పులలో భాగంగా రిజర్వేషన్ చేయించుకుని ఎక్కాల్సిన స్టేషన్లో కాకుండా తరువాత స్టేషన్లో రైలు ఎక్కితే ఏం జరుగుతుంది? అనేది ప్రతి ఒక్కరు ప్రస్తుతం తెలుసుకోవలసిన రైల్వే అప్డేట్. గతంలో రిజర్వేషన్ చేయించుకుని ఎక్కాల్సిన స్టేషన్లో రైలు ఎక్కకుండా, ఆ తరువాత రైల్వే స్టేషన్లో రైలు ఎక్కినప్పటికీ వారికి సంబంధించిన సీటు వారికే ఉండేది. ఇప్పుడు ఇకనుండి ఈ విధానం చెల్లదని రైల్వే పేర్కొంది.

Railway update: Know What happens if you board a train at a later station instead of the designated station?

రిజర్వేషన్ చేయించుకొని ఎక్కవలసిన స్టేషన్లో ఎక్కకుండా, తదుపరి స్టేషన్లో రైలు ఎక్కి ఇది నా సీటు అంటే ఇకపై కుదరదని పేర్కొంది. గతంలో రైల్వే టిటిఈలకు ప్రింట్ చేసిన రిజర్వేషన్ చార్ట్ లను అందించేవారు. దీంతో రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికుడు తాను ఎక్కవలసిన రైల్వేస్టేషన్లో ట్రైన్ ఎక్కకుండా తరువాత ఒక గంట కాలంలో తరువాత వచ్చే రెండు రైల్వే స్టేషన్లలో ఎక్కడ ఎక్కినా వారికి ఆ సీటును కేటాయించేవారు.

కానీ ఇప్పుడు అందుకు అవకాశం లేదని తెలుస్తుంది. కొంతకాలంగా టీటీఈలు హ్యాండ్ హెల్డ్ టెర్మినల్స్ ద్వారా ఎప్పటికప్పుడు రైలులో రిజర్వేషన్ వివరాలను పరిశీలిస్తున్నారు. ట్యాబ్స్ మాదిరిగా ఉండే ఈ యంత్రాలలో ఎప్పటికప్పుడు వివరాలు కూడా అప్లోడ్ అవుతుంటాయి. ఒక స్టేషన్లో రైలు రిజర్వేషన్ చేసుకొని ఎక్కాల్సిన వారు అక్కడ రైలు ఎక్కకపోతే తర్వాత స్టేషన్ వచ్చేలోపు ఆర్ఏసి, వెయిటింగ్ లిస్టులో ఉన్న ప్రయాణికులకు బెర్త్ ను కేటాయించే అవకాశం ఉంది.

తరువాత స్టేషన్లో ట్రైన్ ఎక్కి నా బెర్త్ ఎక్కడ? అని ప్రశ్నించేందుకు రైల్వే ప్రయాణికులకు హక్కు ఉండదు. ఒకవేళ అలా తర్వాత స్టేషన్లో రైలు ఎక్కాలి అనుకుంటే వారు అసలు ఎక్కాల్సిన చోటు రైలు ఎక్కటం మిస్ అయినవారు ఆన్లైన్లో బోర్డింగ్ వివరాలను మార్చుకోవాల్సి ఉంటుంది అని రైల్వే అధికారులు చెబుతున్నారు. అలా మార్చుకున్న వారికే వారి బెర్త్ సేఫ్ గా ఉంటుందని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+