విజయవాడకు రజినీకాంత్: చంద్రబాబు, బాలయ్యలతో కలిసి ఒకే వేదికపై తలైవా!!
సినిమా రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని, రాజకీయాలలో కూడా రాణించాలని ప్రయత్నం చేసి, తొలి ప్రయత్నాన్నే విరమించుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్ త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. తలైవా రజనీకాంత్ ఈనెల 28వ తేదీన విజయవాడలో పర్యటించనున్నారు. రజినీకాంత్ విజయవాడకు వస్తున్నారు అంటే ఏదైనా సినిమా షూటింగ్ ఉండొచ్చేమో అని భావిస్తే పప్పులో కాలేసినట్టే.
రజినీకాంత్ ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి విజయవాడ కు వస్తున్నారు. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలలో పాల్గొనడం కోసం రజనీకాంత్ విజయవాడకు వస్తున్నారని సమాచారం. బెజవాడ పోరంకి లోని అనుమోలు గార్డెన్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు, ఎన్టీఆర్ తనయుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ రజనీకాంత్ తో కలిసి పాల్గొనబోతున్నారు.

సూపర్ స్టార్ రజినీకాంత్, చంద్రబాబు నాయుడు, బాలకృష్ణల త్రయం ఒకే వేదిక పైన కనిపించబోతున్నారు. ఎన్టీఆర్ ప్రసంగాలపై ప్రచురించిన రెండు పుస్తకాలను కూడా ఈ సందర్భంగా ఆవిష్కరించనున్నారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న సభలో ముఖ్య అతిథిగా పాల్గొననున్న రజినీకాంత్ ఏమి మాట్లాడతారు అన్నది ప్రతి ఒక్కరికి ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఆసక్తిగా మారింది.
సూపర్ స్టార్ రజినీ కాంత్ కు, చంద్రబాబుకు మధ్య చాలా కాలంగా సత్సంబంధాలు ఉన్నాయి. ఈ సంవత్సరం ప్రారంభంలోనే ఒకమారు చంద్రబాబుతో రజినీ కాంత్ భేటీ అయ్యారు. అప్పుడు బీజేపీ రాయబారిగా ఆయన రెండు పార్టీల మధ్య సఖ్యత కుదర్చటం కోసం భేటీ అయినట్టు చర్చ జరిగింది. మరి ఈసారి విజయవాడకు రజినీకాంత్ రానున్న నేపధ్యంలో ఏం జరుగుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications