మళ్లీ డ్యూయల్ రోల్ చేయబోతున్న రామ్ చరణ్?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తండ్రీ కొడుకులుగా భిన్నమైన నేపథ్యంలో రామ్ చరణ్ కనిపించబోతున్నారు. గేమ్ చేంజర్ అనే పేరు ఖరారు చేశారు. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని లుక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. శంకర్ దర్శకత్వంలో సినిమా పూర్తిచేసిన తర్వాత ఉప్పెన ఫేం సానా బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ నటించబోతున్నాడు. రంగస్థలం కంటే ఒక అద్భుతమైన పాత్రను ఈ సినిమాలో చేయబోతున్నట్లు ఇప్పటికే చరణ్ స్పష్టం చేశారు.

ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికర వార్త చిత్రసీమలో నడుస్తోంది. ఈ మూవీలో కూడా రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లోనే అన్నదమ్ములుగా కనిపిస్తాడని, కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ కథ ఉంటుందని తెలుస్తోంది. అందులో రెండు భిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రలలో రామ్ చరణ్ కనిపించబోతున్నాడు అనే ప్రచారం జరుగుతోంది. రెండు పాత్రల కోసం మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ ని కథానాయికలుగా తీసుకోవడానికి బుచ్చిబాబు ప్రయత్నాలు చేస్తున్నారు.

 ramcharan

ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకూర్చబోతున్నాడని, ఒకవేళ అదే నిజమైతే ఏడు సంవత్సరాల తర్వాత రెహమాన్ తెలుగులో చేయబోయే చిత్రం ఇదే అవుతుంది. నాగచైతన్య సాహసం శ్వాసగా సాగిపో చిత్రానికి రెహమాన్ చివరకుగా సంగీతం అందించారు. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కింది. ఈ సినిమా తర్వాత దీనికి సంగీతం అందించబోతున్నారని అంటున్నారు. మరోవైపు ఈ సినిమాలో రామ్ చరణ్ కాళ్లు లేని వికలాంగుడిగా కనిపిస్తాడనే ప్రచారం నడుస్తోంది. ఏదేమైనప్పటికీ బుచ్చిబాబు దర్శకత్వంలో చరణ్ చేయబోయే సినిమాపై వస్తున్న వార్తలు మాత్రం అంచనాలు పెంచేవిధంగానే ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+