వీపు బాగుంది: ఎన్టీఆర్ మరో బయోపిక్‌పై వర్మ, భర్తను వదిలి.. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి ఎలా?

Posted By:
Subscribe to Oneindia Telugu
  ఎన్టీఆర్ మరో బయోపిక్‌పై వర్మ : వీపు హాట్ గా బాగుంది | Oneindia Telugu

  హైదరాబాద్: స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా మరో సినిమా తెరకెక్కనుంది. ఇప్పటికే రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంపై వివాదం కొనసాగుతోంది.

  చదవండి: ఆపెయ్, లేకుంటే: వర్మకు వాణీవిశ్వనాథ్ హెచ్చరిక, అల్లుళ్లపై ఏం చెప్పారంటే: లక్ష్మీపార్వతి షాకింగ్

  మరోవైపు, నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా తన తండ్రి బయోపిక్ తీయనున్నారు. ఇప్పుడు మూడో బయోపిక్ తెరపైకి వచ్చింది.

  చదవండి:"నేనెం అందగత్తెనా?, నన్నో తల్లిని అడిగినట్టే ఎన్టీఆర్ అలా!, ఆ విషయం విని షాకయ్యా" 

  లక్ష్మీపార్వతి పాత్రలో వాణీ విశ్వనాథ్?

  లక్ష్మీపార్వతి పాత్రలో వాణీ విశ్వనాథ్?

  దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి 'లక్ష్మీస్‌ వీరగ్రంథం' పేరుతో ఎన్టీఆర్‌ బయోపిక్‌ను తీస్తున్నట్లు తెలిపారు. రామారావుపై ఉన్న అభిమానంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు చెప్పారు. లక్ష్మీపార్వతి పాత్ర కోసం వాణి విశ్వనాథ్‌, రాయ్‌లక్ష్మీలను సంప్రదించారు.

  జనవరిలో సినిమా విడుదల..

  జనవరిలో సినిమా విడుదల..

  నవంబర్‌ నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించి, జనవరిలో సినిమాను విడుదల చేయన్నుట్లు కేతిరెడ్డి తెలిపారు. కేతిరెడ్డి సినిమాలతో పాటు తమిళ రాజకీయాల్లోను చురుగ్గా ఉన్నారు.

  ఈ సినిమాలో మరో రకమైన ట్విస్ట్..

  ఈ సినిమాలో మరో రకమైన ట్విస్ట్..

  తన సినిమాలో ఎన్టీఆర్ తొలి భాగం, ఆఖరి భాగం కాకుండా ఆ మధ్యలో జరిగిన విషయాలు వెల్లడిస్తానని కేతిరెడ్డి తెలిపారు. ప్రజలకు తెలియని విషయాలు ఉంటాయన్నారు.

  ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి ఎలా ప్రవేశించారు

  ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి ఎలా ప్రవేశించారు

  లక్ష్మీపార్వతి మొదటి భర్త వీరగంధం సుబ్బారావు హరికథలు చెప్పుకునేందుకు వాడవాడలా తిరిగారని, ఇక ఎన్టీఆర్ రెండో భార్యగా ఆయన జీవితంలోకి లక్ష్మీపార్వతి ఎలా ప్రవేశించారన్న విషయం ప్రజలకు తెలియాల్సి ఉందని, తిరుపతిలోని వెంకన్న సన్నిధిలో ప్రారంభోత్సవం చేసి, నవంబర్ రెండో వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతామని కేతిరెడ్డి చెప్పారు.

  మొదటి భర్తను వదిలి ఎన్టీఆర్ వద్దకు లక్ష్మీపార్వతి వచ్చేదాకా

  మొదటి భర్తను వదిలి ఎన్టీఆర్ వద్దకు లక్ష్మీపార్వతి వచ్చేదాకా

  యథార్థ సంఘటనల ఆధారంగానే ఈ సినిమాను నిర్మిస్తామని, లక్ష్మీపార్వతి, వీరగంధం సుబ్బారావు గారి జీవిత చరిత్రలను తెలుసుకుంటున్నామని, లక్ష్మీ పార్వతి తన మొదటి భర్త వీరగంధం సుబ్బారావుని వదిలి సూట్ కేస్‌తో బయటకు రావడంతో సినిమా మొదలై, ఎన్టీఆర్ జీవితంలోకి ఆమె ప్రవేశించడంతో ఈ సినిమా ముగుస్తుందన్నారు.

  రామ్ గోపాల్ వర్మ కామెంట్

  రామ్ గోపాల్ వర్మ కామెంట్

  'లక్ష్మీస్‌ వీరగ్రంథం' సినిమాపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. సినిమా పోస్టర్‌ను పోస్ట్ చేసి 'తానెవరో నాకు తెలియదు కానీ వీపు మాత్రం బాగుంది' అని పేర్కొన్నారు.

  ట్విస్టులు, రాజకీయ కోణమా?

  ట్విస్టులు, రాజకీయ కోణమా?

  ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి వచ్చినప్పటి నుంచి ఆయన చనిపోయే వరకు తన సినిమా ఉంటుందని వర్మ వెల్లడించారు. దీంతో వర్మ... లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంపై రాజకీయ దుమారం మొదలైంది. పైగా ఆ సినిమా నిర్మాత వైసిపి నేత. రోజా నటించవచ్చునని వార్తలు వచ్చాయి. ఇప్పుడు లక్ష్మీపార్వతి తన అంతకుముందు భర్తను వదిలి ఎన్టీఆర్ జీవితంలోకి ప్రవేశించే విషయం వెల్లడిస్తామని, అందులో వాణి విశ్వనాథ్ కథానాయికగా నటించవచ్చునని చెప్పడంతో ఇందులోను ఏమైనా రాజకీయ కారణాలు ఉన్నాయా అనే చర్చ సాగుతోంది.

  టిడిపిలో చేరేందుకు వాణీ విశ్వనాథ్ ఆసక్తి

  టిడిపిలో చేరేందుకు వాణీ విశ్వనాథ్ ఆసక్తి

  ఎందుకంటే వాణీ విశ్వనాథ్.. వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై భగ్గుమన్నారు. అంతేకాదు, ఆమె టిడిపిలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అలాంటి వాణీవిశ్వనాథ్ ఎన్టీఆర్ మూడో బయోపిక్‌లో నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఆమె నటి కాబట్టి సంప్రదిస్తుండవచ్చు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Director Ram Gopal Varma responds on Lakshmis Veeragrantham poster.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి