చంద్రబాబుకు అద్దిరిపోయే బర్త్‌డే గిఫ్ట్‌ను రెడీ చేసిన ఆర్జీవీ
అమరావతి: గురువారం- తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడి పుట్టినరోజు. 73వ సంవత్సరంలోకి అడుగు పెట్టనున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చంద్రబాబు జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకోవడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు సన్నద్ధమౌతోన్నారు.
ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలు, నియోజకవర్గాల్లో చంద్రబాబు పుట్టినరోజు వేడుకలను నిర్వహించుకోవడానికి పార్టీ నాయకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పట్టణాలు, మండల కేంద్రాల్లో కేక్ కట్ చేయనున్నారు. రక్తదాన, వైద్య శిబిరాలు నిర్వహించనున్నారు. అన్నదానాలతోపాటు ఆసుపత్రుల్లో రోగులకు పండ్లను పంపిణీ చేయనున్నారు. విస్తృతంగా సేవా కార్యక్రమాలను చేపట్టడానికి రెడీ అవుతున్నారు.

చంద్రబాబు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న కుప్పం నియోజకవర్గంలో అప్పుడే ఆయన జన్మదిన వేడుకల కోలాహలం నెలకొంది. నియోజకవర్గంపై పట్టు కోల్పోలేదని నిరూపించుకునేలా ఈ ఏర్పాట్లను సాగిస్తోన్నారు టీడీపీ నాయకులు. తెలుగుదేశం పార్టీ జెండాలను కట్టారు. నియోజకవర్గ కార్యాలయాన్ని అలంకరించారు. పేదలకు అన్నదాన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశారు.
. #CbnSicko పాటలోని లిరిక్సు,వాయిస్‌లు , మ్యూజిక్ అన్ని ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ క్రియేట్ చేసినవే..ఇందులో ఒక వాయిస్ నా వాయిస్‌ని పోలివుంటుంది కానీ ఆ వాయిస్ నాది కాదు, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ క్రియేట్ చేసిందేనని పంచభూతాల మీద ప్రమాణం. సాంగ్ రిలీజ్ రేపు ఏప్రిల్ 20 th 12 గంటలకి pic.twitter.com/JwDZy6XFOJ
— Ram Gopal Varma (@RGVzoomin) April 19, 2023
అదే సమయంలో- చంద్రబాబుకు అద్దిరిపోయే బర్త్‌డే గిఫ్ట్‌ను ఇవ్వడానికి రెడీ అయ్యారు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. రాష్ట్ర రాజకీయాలపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తరచూ తనదైన శైలిలో సెటైర్లు సంధిస్తుంటారనే విషయం తెలిసిందే. ఇదివరకు చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ను టార్గెట్‌గా చేసుకుని విమర్శలు చేశారు. సెటైర్లతో చెలరేగిపోయారు. పవన్ కల్యాణ్ వారాహి వాహనాన్నీ వదల్లేదు.

CBN గారి పుట్టిన రోజు సందర్భంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ , #CbnSicko అనే ఒక ఎక్స్ట్రా స్పెషల్ పాటని క్రియేట్ చేసింది …ఆ పాట రేపు ఏప్రిల్ 20th న @ncbn గారికి ఒక వెరీ హ్యాపీ బర్తడే గిఫ్ట్ గా రిలీజ్ అవ్వబోతుంది pic.twitter.com/T3PkyLhE46
— Ram Gopal Varma (@RGVzoomin) April 19, 2023
ఆ గళం కూడా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్రియేట్ చేసిందేనని, పంచభూతాల మీద ప్రమాణం చేసి, చెబుతున్నానంటూ సెటైర్లకు పరోక్షంగా తెర తీశారు. ఈ పాటను గురువారం మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేస్తానని అన్నారు. చంద్రబాబు కోసమే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్.. ఈ సీబీఎన్ సిక్కో అనే స్పెషల్ సాంగ్‌ను క్రియేట్ చేసిందని స్పష్టం చేశారు. చంద్రబాబుకు వెరీ హ్యాపీ బర్త్‌డే గిఫ్ట్‌గా అవ్వబోతోందని చెప్పారు.












Click it and Unblock the Notifications