అశ్లీల నృత్యాలు: అమ్మాయిలు సహా 23మంది అరెస్ట్

వీరులో ముగ్గురు యువతులు, ఇరవై మంది యువకులు ఉన్నారు. రేవ్ పార్టీ పేరుతో వీరు ఈ కార్యక్రమం పెట్టుకున్నారు. ఇది తెలిసిన పోలీసులు రైడ్ చేసి పట్టుకున్నారు. నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వీరు ఫాం హౌస్‌లో మద్యం సేవించి అసభ్యకరంగా నృత్యం చేస్తున్నట్లు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
గంజాయీ పట్టివేత
విశాఖ జిల్లాలో రూ.40 లక్షల విలువైన గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కారులో తరలిస్తున్న 245 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
విద్యార్థిని అదృశ్యం
రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఉప్పల్ సూర్యానగర్‌కు చెందిన ఎం ఫార్మసీ విద్యార్థిని ఒకరు అదృశ్యమయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications