పొలిటికల్ పంచ్ రవికిరణ్‌కు బెయిల్, కానీ, విజయ సాయిరెడ్డి హెచ్చరిక

Posted By:
Subscribe to Oneindia Telugu

విశాఖ: ఏపీ శాసనమండలిపై అసభ్య పోస్టులు పెట్టిన కేసులో అరెస్టయిన పొలిటికల్ పంచ్ ఇంటూరి రవికిరణ్‌కు బెయిలు లభించింది. అసెంబ్లీ కార్యదర్శి సత్యనారాయణ ఫిర్యాదు మేరకు రవికిరణ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి గుంటూరు సబ్ జైలుకు తరలించారు.

వంగలపూడి అనిత ఫిర్యాదు ఎఫెక్ట్: పొలిటికల్ పంచ్ రవికిరణ్ అరెస్ట్

రవికిరణ్‌కు బెయిల్

రవికిరణ్‌కు బెయిల్

మంగళవారం రవికిరణ్‌కు మంగళగిరి కోర్టు బెయిలు మంజూరు చేసింది. అయితే మరో కేసులో ఆయనకు బెయిలు రావాల్సి ఉండడంతో రవికిరణ్ జైలులోనే ఉండాల్సి వచ్చింది.

అనిత కేసులో బెయిల్ రావాల్సి ఉంది

అనిత కేసులో బెయిల్ రావాల్సి ఉంది

తనపై పొలిటికల్ పంచ్ రవికిరణ్ అసభ్యకరంగా పోస్టులు పెట్టారని పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై అట్రాసిటీ కేసు నమోదైంది. ఈ కేసులో ఆయనకు బెయిలు రావాల్సి ఉంది.

కలిసిన విజయసాయి

కలిసిన విజయసాయి

ఇదిలా ఉండగా, మంగళవారం వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డి జైలుకు వెళ్లి రవికిరణ్‌ను పరామర్శించారు.రవి కిరణ్ గురించి తొలుత తెలియదన్న వైసిపి, ఆ తర్వాత తమవాడే అన్నట్లుగా మాట్లాడింది.

బాబు ప్రభుత్వానికి హెచ్చరిక

బాబు ప్రభుత్వానికి హెచ్చరిక

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో వైసిపి అధికారంలోకి రావడం ఖాయమని, అక్రమ కేసులు బనాయించిన వారిని వదిలి పెట్టేది లేదని టిడిపి ప్రభుత్వాన్ని, చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Political punch Inturi Ravikiran gets bail in one case.
Please Wait while comments are loading...