అదిరిపోయిన జియో ప్రీపెయిడ్ ప్లాన్స్
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఇండియా రెండో స్థానానికి చేరుకుంది. ఇంటర్నెట్ వినియోగం కూడా అదే స్థాయిలో ఉంది. వినియోగదారులను ఆకట్టుకునేందుకు టెలికాం కంపెనీలు కొత్త కొత్త ప్లాన్‌లు తీసుకొస్తున్నాయి. తాజాగా రిలయన్స్ జియో (Reliance Jio) కొత్త ప్లాన్‌ని ప్రకటించింది. నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌తో ప్రీపెయిడ్ మొబైల్ ప్లాన్‌లను తీసుకొచ్చింది. నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌తో ఒకటి రూ.1099 ప్లాన్ కాగా, మరొకటి రూ.1499 ప్లాన్.
రూ.1099 ప్రీపెయిడ్ ప్లాన్: వ్యాలిడిటీ 84 రోజులు ఉంటుంది. ప్రతి రోజు 2 జీబీ డేటా, అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, అన్ లిమిటెడ్ 5జీ డేటా పొందుతారు. నెట్‌ఫ్లిక్స్ మొబైల్‌ప్లాన్ సబ్‌స్క్రిప్షన్ పొందాలంటే నెలకు రూ.149, సంవత్సరానికి రూ.1788 చెల్లించాలి. స్మార్ట్‌ఫోన్, టాబ్లెబ్స్‌లో నెట్‌ఫ్లిక్స్ 480p మీద స్ట్రీమింగ్‌ను అందజేస్తోంది.

రూ.1499 ప్రీపెయిడ్ ప్లాన్: వ్యాలిడిటీ 84 రోజులు. రోజుకు 3GB డేటా, అన్ లిమిటెడ్ 5G డేటా, అన్ లిమిటెడ్ వాయిస్ కాల్ వంటి ప్రయోజనాలు ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ కావాలంటే నెలకు రూ.199, సంవత్సరానికి రూ.2,388 చెల్లించాలి. టీవీలు, కంప్యూటర్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లలో 720p మీద స్ట్రీమింగ్‌ను అందజేస్తుంది.
తమ వినియోగదారులకు ప్రపంచస్థాయి సేవలను అందించడానికి కట్టుబడి ఉన్నామని, ప్రీపెయిడ్ ప్లాన్స్ తో నెట్ ఫ్లిక్స్ బండిల్స్ ప్రారంభిస్తున్నామని, ఇది తమ సంకల్పాన్ని చాటిచెబుతోందని జియో ప్లాట్ ఫామ్స్ సీఈవో కిరణ్ థామస్ వ్యాఖ్యానించారు. నెట్ ఫ్లిక్స్ వంటి గ్లోబల్ పార్ట్ నర్ తో తమ భాగస్వామ్యానికి మరింత బలం చేకూరుతుందన్నారు. భారతదేశం అంతటా ప్రేక్షకులు ఇష్టపడే అనేక రకాల విజయవంతమైన స్థానిక ప్రదర్శనలు, డాక్యుమెంటరీలు, సినిమాలను ఈ ప్లాట్ ఫాంద్వారా పొందవచ్చన్నారు.












Click it and Unblock the Notifications