వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబుకు మరో చిక్కు: టీ మీడియా రిపోర్ట్ (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి మరో చిక్కు వచ్చిపడింది. జాబు కావాలంటే బాబు రావాలి అంటూ ప్రకటనలు గుప్పించిన చంద్రబాబు అధికారంలోకి రాగానే 294 మంది యువకులను ఉద్యోగాల పేరుతో మోసం చేశారంటూ నమస్తే తెలంగాణ ప్రతిక ఓ వార్తాకథనాన్ని ప్రచురించింది.

అవసరానికి తమతో పనిచేయించుకుని ఆపై నడిరోడ్డుపై వదిలేశారంటూ పలువురు యువకులు హైదరాబాదులోని బంజారాహిల్స్‌లోని ఎన్టీఆర్ ట్రస్టు భవన్ వద్ద ఆందోళనకు దిగిన విషయాన్ని వార్తాకథనంగా ప్రచురించింది. ఆందోళనకారుల ఛాయాచిత్రాలను కూడా ప్రచురించింది. బాధితులు తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారంటూ ఆ కథనాన్ని ప్రచురించింది.

నమస్తే తెలంగాణ దినపత్రిక కథనం ప్రకారం - ఎన్నికలకు ముందు రాష్ట్రంలోని 294 నియోజకవర్గాల్లో వివిధ పార్టీల బలాబలాలు, స్థానికుల మద్దతు ఎవరికి, టిడిపి అభ్యర్థిగా ఎవరిని నిలబెడితే విజయావకాశాలుంటాయనే విషయాలను తెలుసుకునేందుకు నియోజకవర్గానికి ఒక్కో ప్రతినిధి చొప్పున 294 మంది నిరుద్యోగ యువకులను నియమించుకున్నారు.

నమస్తే తెలంగాణ వార్తాకథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి...

టీ మీడియా చిక్కులు..

టీ మీడియా చిక్కులు..

నియోజకవర్గాల్లో పరిస్థితిని అంచనా వేసి, తెలియజేయడానికి చంద్రబాబు పార్టీ కోసం నియమించుకున్నవారిలో ఇంజనీరింగ్, పిజి చేసినవారున్నారు.

టీ మీడియా చిక్కులు

టీ మీడియా చిక్కులు

ప్రతి నెలా వారికి 18 వేల రూపాయల చొప్పున జీతం ఇవ్వడంతో పాటు టిడిపి గెలిచిన తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే ఉద్యోగాలను పర్మినెంట్ చేస్తామని ఎన్టీఆర్ ట్రస్టు భవన్ వర్గాలు హామీ ఇచ్చినట్లు నమస్తే తెలంగాణ రాసింది.

టీ మీడియా చిక్కులు

టీ మీడియా చిక్కులు

తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగ యువకులు ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌కు వెల్లి ఆరా తీశారని, పనికి డబ్బులు ఇచ్చేశాం, పర్మినెంట్ చేయబోమని చెప్పారని నమస్తే తెలంగాణ రాసింది.

టీ మీడియా చిక్కులు

టీ మీడియా చిక్కులు

నిరుద్యోగ యువకులు ఏం చేయాలో తెలియక శుక్రవారంనాడు ఎన్టీఆర్ ట్రస్టు భవన్ వద్ద పడిగాపులు కాశారు.

టీ మీడియా చిక్కులు

టీ మీడియా చిక్కులు

శుక్రవారం సాయంత్రం ఐదు గంటల వరకు పడిగాపులు కాసిన నిరుద్యోగ యువకులు ఫలితం లేకపోవడంతో చంద్రబాబు ఇంటికి వెళ్లారు.

టీ మీడియా చిక్కులు

టీ మీడియా చిక్కులు

చంద్రబాబును కలవడానికి అనుమతి లేదంటూ పోలీసులు చెప్పడంతో ఎపి సిఎం క్యాంపు ఆఫీసుకు నిరుద్యోగ యువకులు వచ్చారు.

టీ మీడియా చిక్కులు

టీ మీడియా చిక్కులు

సిఎం క్యాంప్ ఆఫీసు లేక్‌వ్యూ అతిథి గృహానికి వచ్చిన యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు.

English summary

 According to Namasthe Telangana daily - removed staff of NTR trust bhavan were cheated by Telugudesam party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X