సీఎంగా రేవంత్ రెడ్డి సక్సెస్ అవ్వాలి: చంద్రబాబు, నారా లోకేష్ ట్వీట్!!
తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డికి నరేంద్ర మోడీతో సహా ఇతర రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రి, మంత్రులు శుభాభినందనలు తెలియజేస్తున్నారు. అయితే తెలంగాణ సీఎం గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వస్తారని అందరూ భావించిన చంద్రబాబు ప్రమాణస్వీకారానికి హాజరు కాలేదు కానీ చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికగా రేవంత్ రెడ్డికి తన శుభాకాంక్షలు తెలియజేశారు.
చంద్రబాబు మాత్రమే కాదు, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక ట్విట్టర్ వేదికగా చంద్రబాబు పెట్టిన ఒక పోస్టులో తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఎనుముల రేవంత్ రెడ్డి గారికి అభినందనలు అని పేర్కొన్నారు. ఆయన ప్రజాసేవలో విజయం సాధించాలని కోరుకుంటున్నాను అని పేర్కొన్నారు.


సీఎంగా రేవంత్ రెడ్డి సక్సెస్ అవ్వాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ఇక చంద్రబాబు రేవంత్ రెడ్డి ప్రజాసేవలో విజయం సాధించాలని ట్వీట్ చేసినప్పటికీ, చంద్రబాబుకి రేవంత్ రెడ్డికి మధ్య ఉన్న అనుబంధం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అధినేత చంద్రబాబు నాయుడుకి తెలుగుదేశం పార్టీలో గతంలో పనిచేసిన రేవంత్ రెడ్డి అత్యంత సన్నిహితుడుగా ఉండేవాడని ప్రతి ఒక్కరికి తెలుసు.

రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రేవంత్ రెడ్డి రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2017 లో కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డి అప్పటినుంచి అంచెలంచెలుగా ఎదిగి, ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని సీఎం పదవిని అధిష్టించారు. ఇదిలా ఉంటే నారా లోకేష్ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
రేవంత్ రెడ్డికి అభినందనలు మరియు శుభాకాంక్షలు అంటూ పేర్కొన్న నారా లోకేష్ తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవి స్వీకరణ చేసిన సందర్భంగా ఆయన పదవీకాలం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను అంటూ ట్విట్టర్లో పేర్కొన్నారు. బయటకు చెప్పినప్పటికీ రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం అయ్యారంటే ఎక్కువ సంతోషపడే వాళ్ళలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, టిడిపి నేతలు ఉంటారు.












Click it and Unblock the Notifications