వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జబర్దస్త్ పంచ్ లు వేసిన నాగబాబుకు పంచ్ పడింది .. నర్సాపురంలో నాగబాబు ఓటమి

|
Google Oneindia TeluguNews

ఏపీలో ఎన్నికల్లో తొలిసారి బరిలోకి దిగిన మెగా బ్రదర్ నాగబాబు ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తానని భావించారు. కానీ నర్సాపురం నుండి ఎన్నికల బరిలోకి దిగిన నాగబాబును నర్సాపురం ప్రజలు ఆదరించలేదు. ఎన్నికల సమయంలో సైతం ప్రత్యర్ధులపై మాటల దాడి చేసి రోజుకో సంచలనం సృష్టించిన నాగబాబు వైసీపీ నేత రఘరామ కృష్ణం రాజు పై జబర్దస్త్ పంచ్ లు వేశారు. రాజకీయాల్లోకి రీసెంట్ గా వచ్చినా సీనియర్ లాగా విమర్శల వర్షం కురిపించారు . చివరకు వైసీపీ అభ్యర్ధి రఘరామ కృష్ణం రాజు చేతిలో ఓటమి పాలయ్యారు నాగబాబు.

<strong>మూడో స్థానంలో జనసేన విశాఖ అభ్యర్థి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ .. షాక్ ఇచ్చిన విశాఖ ప్రజలు</strong>మూడో స్థానంలో జనసేన విశాఖ అభ్యర్థి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ .. షాక్ ఇచ్చిన విశాఖ ప్రజలు

ఎన్నికల బరిలో రెచ్చిపోయిన నాగబాబు .. ప్రత్యర్ధులపై జబర్దస్త్ పంచ్ లు

ఎన్నికల బరిలో రెచ్చిపోయిన నాగబాబు .. ప్రత్యర్ధులపై జబర్దస్త్ పంచ్ లు

జనసేన తరపున నరసాపురం ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన పవన్ సోదరుడు నాగబాబు తనను నాన్ లోకల్ అంటూ వైసీపీ ఎంపీ అభ్యర్ధి రఘరామ కృష్ణం రాజు చేసిన వ్యాఖ్యలపై తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి పోశారు .ఎవడా రాస్కెల్ నేను నాన్ లోకల్ అంది అంటూ భగ్గుమన్నారు .ఇక పోటీ చేసిన నియోజకవర్గంలో ప్రచారంలో సైతం ఉత్సాహంగా పాల్గొన్న నాగబాబు జబర్దస్త్ పంచ్ లు నర్సాపురం ఓటర్లను ఆకట్టుకోలేకపోయాయి. నర్సాపురం నుంచి మాత్రం ఎంపీగా పవన్ సోదరుడు మెగా బ్రదర్ నాగబాబుని పోటీలో దింపడంతో అక్కడ తప్పకుండా నాగబాబే గెలుస్తారని అంతా అనుకున్నారు.

వైసీపీ అభ్యర్థి రఘరామ కృష్ణం రాజు గెలుపు .. నాగబాబు ఘోర ఓటమి

వైసీపీ అభ్యర్థి రఘరామ కృష్ణం రాజు గెలుపు .. నాగబాబు ఘోర ఓటమి

కానీ ఊహించని రీతిలో అక్కడ వైసీపీ అభ్యర్థి రఘురామ కృష్ణం రాజు విజయకేతనాన్ని ఎగురవేశారు. నర్సాపురం ఎంపీగా ఎన్నికల సంఘం నుంచి బాధ్యతలు చేపడుతున్నట్టుగా ధ్రువీకరణ పత్రాన్ని కూడా అందుకున్నారు. మరి నర్సాపురం ఎంపీగా విజయం సాధిస్తే హ‌ద్దులు లేకుండా ప‌నిచేస్తా. ఒక ఎంపీ ఏం చేయ‌గ‌ల‌డో..ఎంత చేయ‌గ‌ల‌డో చేసి చూపిస్తా" అని ఫేస్‌బుక్ లైవ్ ద్వారా నాగ‌బాబు తన మనసులోని కోరిక చెప్పారు. ఆయన కోరిక తీరలేదు. నాగబాబు జబర్దస్త్ పంచ్ లు వేసిన వైసీపీ అభ్యర్థి రఘురామ కృష్ణం రాజు విజయం సాధించి రివర్స్ పంచ్ ఇచ్చారు.

గట్టి పోటీ కూడా ఇవ్వలేక చిత్తుగా ఓడిన నాగబాబు .. నాగబాబుకు పంచ్ ఇచ్చిన నర్సాపురం ప్రజలు

గట్టి పోటీ కూడా ఇవ్వలేక చిత్తుగా ఓడిన నాగబాబు .. నాగబాబుకు పంచ్ ఇచ్చిన నర్సాపురం ప్రజలు

అటు నర్సాపురం లోక్‌సభ బరిలో దిగిన నాగబాబు కనీసం గట్టి పోటీ కూడా ఇవ్వలేక చిత్తుగా ఓడారు. అక్కడ ఆయన మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి రఘురామ కృష్ణంరాజు విజయం సాధించగా...టీడీపీ అభ్యర్థి శివరామరాజు రెండో స్థానంలో నిలిచారు. మెగా బ్రదర్ నాగబాబు ఓటమి పాలవడంతో జనసేన శ్రేణుల్లో నిరుత్సాహం నెలకొంది. ఇక ప్రత్యర్ధి పార్టీ నేతలైతే జబర్దస్త్ నాగబాబు జబర్దస్త్ షో చేసుకుంటే సరిపోతుంది ఇక అంటూ సెటైర్లు వేశారు.

English summary
Mega Brother Nagababu, who was contested from narsapuram in the election in AP, is expected to win this election. But Narsapurpuram people did not support Nagababu from Narsapur. Nagababu had created a sensation for the attack on the opponent YCP candidate Raghurama Krishnam Raju at the time of the election campaign taking Jabardasth as platform . Although Nagababu was a junior in politics, but he criticized opponents like a senior. Naga Babu was finally defeated by the YCP candidate Raghurama Krishnam Raju. At least Nagababu couldn't give up the hardest competition . Where he finished it at the third position.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X