Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

'టెన్త్ చదివిన రోజా ఎమ్మె చదివిన బాబుపైనా, పరువు తీశావ్'

విజయవాడ: ఎంఏ చదివిన, రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు ఆంగ్ల భాషా పరిజ్ఞానాన్ని పదో తరగతి చదివిన వైసిపి ఎమ్మెల్యే రోజా అవహేళన చేయడం విడ్డూరమన్న తెలుగుదేశం పార్టీ నేత గాలి ముద్దుకృష్ణమ మండిపడ్డారు.

రెండు పర్యాయాలు ఎమ్మెల్యే టిక్కెట్ ఇప్పించి, రాష్ట్ర అధ్యక్షురాలిగా చేసి, రాజకీయ భిక్ష పెట్టిన చంద్రబాబును విమర్శించే నైతిక అర్హత రోజాకు లేదన్నారు. చంద్రబాబు రాత్రింబవళ్లు కష్టపడి హైదరాబాదుకు ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చారన్నారు.

అమెరికా అధ్యక్షులు, మైక్రోసాఫ్ట్ అధినేతల మెప్పు పొందిన వ్యక్తి అన్నారు. అలాంటి చంద్రబాబు గురించి రోజా మాట్లాడటం శోచనీయమన్నారు. బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగా ఉండి అసెంబ్లీలో అనుచితంగా ప్రవర్తించి.. రోజా చిత్తూరు, నగరి పరువు తీశారన్నారు.

'Roja have no right to talk about Chandrababu'

వైయస్ రాజశేఖర రెడ్డి.. చంద్రబాబు పైన 30 కేసులు పెట్టినా ఒక్క కేసు నిరూపించలేకపోయారన్నారు. వైసిపి అధినేత జగన్ మాత్రం జైలుకు వెళ్లి బెయిల్ తెచ్చుకున్న విషయం ప్రజలకు తెలియదా అని ప్రశ్నించారు. జగన్ అహంకారాన్ని చూడలేక ఆ పార్టీ ఎమ్మెల్యేలు వైసిపిని వీడుతున్నారన్నారు. రాజకీయాలంటే సినిమా డైలాగులుకాదని, కష్టపడి పని చేయాలన్నారు. రాజకీయాల్లో ఓర్పు కావాలన్నారు.

కోట్లు, నోట్లు, ఓట్లు జగన్ నైజం: ఉమ

రాష్ట్రం అభివృద్ధి కోసమే వైసిపి ఎమ్మెల్యేలు టిడిపిలోకి వస్తున్నారని ఎమ్మెల్యే బోండ ఉమ అన్నారు. అభివృద్ధిని అడ్డుకునేది జగన్ ఒక్కడే అన్నారు. రాష్ట్రం బాగుండాలని కోరుకునే వారంతా టిడిపిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. చాలామంది వైసిపి ఎమ్మెల్యేలు టిడిపిలోకి వస్తారన్నారు. జగన్‌కు కావాల్సింది కోట్లు, ఓట్లు, నోట్లు మాత్రమే అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+