అమెరికా గడ్డపై రోజా కూతురు హిస్టరీ! అత్యున్నత అవార్డ్
మాజీ మంత్రి, నటి రోజా కుమార్తె అన్షుమాలిక తల్లికి మించిన తనయ అనిపించుకున్నారు. అమెరికాలోని ప్రముఖ ఇండియానా యూనివర్సిటీ (Indiana University) చరిత్రలో అన్షు తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించింది. యూనివర్సిటీలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన "హెర్మన్ బి వెల్స్ డిస్టింగ్విష్డ్ సీనియర్ అవార్డు (2026)"ను ఆమె కైవసం చేసుకుంది. ఈ అద్భుతమైన వార్తను మాజీ మంత్రి రోజా సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ, తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
అన్షుమాలిక ఇండియానా యూనివర్సిటీలోని లడ్డీ స్కూల్ ఆఫ్ ఇన్ఫర్మాటిక్స్, కంప్యూటింగ్ అండ్ ఇంజినీరింగ్‌లో కంప్యూటర్ సైన్స్ మేజర్‌గా చదువుతోంది. కేవలం చదువులోనే కాకుండా మ్యూజిక్ ప్రొడక్షన్, డేటా సైన్స్‌లో మైనర్ చదువుతూ తన బహుముఖ ప్రజ్ఞను చాటుతోంది.

విజయాల జాబితా చాలా పెద్దదే:
- లీడర్‌షిప్ అవార్డు: 2025లో "మౌరీన్ బిగ్గర్స్ లీడర్‌షిప్ అవార్డ్ ఫర్ ఈక్విటీ అండ్ టెక్నాలజీ ఎక్సలెన్స్" అందుకుంది.
- అకాడెమిక్ ఎక్సలెన్స్: 2024-2025 సంవత్సరానికి "లడ్డీ అకాడెమిక్ ఎక్సలెన్స్ అవార్డు" కూడా పొందింది.
- ప్రతిష్టాత్మక స్కాలర్: "ఫౌండర్స్ స్కాలర్"గా గుర్తింపు పొంది, ఎన్నో ప్రతిష్టాత్మక హానర్స్ సొసైటీలకు అధ్యక్షురాలిగా, కీలక బాధ్యతల్లో సేవలందించింది.
ప్రపంచ వేదికపై సేవా దృక్పథం..
అన్షు కేవలం ల్యాబ్‌లకే పరిమితం కాలేదు. గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్ అవార్డ్ (2024), గ్లోబల్ ఇంపాక్ట్ అడ్వకేట్ అవార్డ్ (2025) వంటి అంతర్జాతీయ గౌరవాలు ఆమెను వరించాయి. డొమినికన్ రిపబ్లిక్ మరియు పోర్చుగల్ దేశాలలో అంతర్జాతీయ సేవా కార్యక్రమాలకు సైట్ లీడర్‌గా నాయకత్వం వహించింది. ప్రస్తుతం ఐయూ కంప్యూటర్ విజన్ ల్యాబ్‌లో ప్రొఫెసర్ డేవిడ్ క్రాండల్ పర్యవేక్షణలో రీసెర్చ్ చేస్తోంది.
సొంతంగా స్వచ్ఛంద సంస్థ స్థాపన..
సామాజిక బాధ్యతలోనూ అన్షు ముందే ఉంది. "Binary Horizons" అనే లాభాపేక్షలేని గ్లోబల్ డిజిటల్ లిటరసీ మరియు AI ఎమ్పవర్‌మెంట్ సంస్థను స్థాపించి, ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తోంది. దీనితో పాటు "Women of IU" పోడ్‌కాస్ట్‌కు ప్రొడ్యూసర్‌గా ఉంటూ మహిళా సాధికారతకు తన వంతు తోడ్పాటు అందిస్తోంది.
రోజా భావోద్వేగ సందేశం..
"కలల నుంచి గెలుపు వరకు.. అన్షు ప్రయాణం మాకు ఎంతో గర్వకారణం. నీ కష్టం, అంకితభావం నిన్ను ఇక్కడికి చేర్చాయి. ఇది కేవలం ఆరంభం మాత్రమే. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది" అంటూ రోజా ఎమోషనల్ పోస్ట్ చేశారు.
అన్షు సాధించిన ఈ విజయం తెలుగు వారందరికీ గర్వకారణమని, విదేశాల్లో చదువుకుంటున్న ఎంతోమంది విద్యార్థులకు ఆమె ఒక స్ఫూర్తి అని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.














Click it and Unblock the Notifications