అక్రమ సంబంధం కారణంగానే రౌడీ షీటర్ హత్య
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు నగరంలోని ఆర్ అగ్రహారం సమీపంలో గల నిమ్మలపేటకు చెందిన రౌడీషీటర్ బత్తుల రవి (25) శనివారం రాత్రి హత్యకు గురయ్యాడు. శనివారం రాత్రి హత్య సమాచారం తెలుసుకొని పోలీసులు మృతదేహం కోసం ఎదురు చూసినా మృతదేహం ఆచూకి దొరకలేదు. ఆదివారం ఉదయం మృతదేహం లభ్యమైంది. రవి లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలో 9 కేసుల్లో నిందితుడు. వీటిలో మూడు హత్య కేసులు కూడా ఉన్నాయి. నరసరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో సామూహిక కేసులో నిందితుడు. రవికి రెండేళ్ల క్రితం మంగళగిరి మండలం డోలాస్‌నగర్‌కు చెందిన యువతితో వివాహం కాగా పిల్లలు లేరు.
గత కొన్నేళ్ల నుంచి బత్తుల రవి, కుక్కల శివ, కోట్లు అనే ముగ్గురు స్నేహితులు. దశాబ్ద కాలం నుంచే నేరాలకు అలవాటు పడ్డారు. అనేక సార్లు జైలుకు కూడా వెళ్లి వచ్చారు. రెండేళ్ల నుంచి కోట్లు చెల్లెలు మాధవితో రవి అక్రమ సంబంధాన్ని ఏర్పర్చుకున్నాడు. అప్పటి నుంచి వీరి మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. పలుమార్లు కోట్లు, కుక్కల శివలు హెచ్చరించినా రవి అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. నాలుగు నెలల క్రితం వీరి ఇరువురి మధ్య నిమ్మలపేటలో ఘర్షణ జరిగింది.

రవిని అంతమొందించాలని నిర్ణయించుకున్న కోట్లు శనివారం రవి తమ్ముడు గోపిని కిడ్నాప్ చేసి బొంతపాడు సమీపంలోని పొలాల్లో తీవ్రంగా హింసించి ఎలాగైనా సరే తన అన్న రవిని తీసుకురమ్మని లేకపోతే గోపిని చంపేస్తానని హెచ్చరించాడు. దీంతో గోపి శనివారం రాత్రి రవిని ఏవో కారణాలు చెప్పి అక్కడికి తీసుకువెళ్లాడు. అప్పటికే మారణాయుధాలతో సిద్ధంగా ఉన్న కుక్కల శివ, కోట్లు బత్తుల రవిని హతమార్చారు. అనంతరం సెల్‌లో శవం ఫొటోలు తీసి ఇంటికి వచ్చి రవి బాబాయి కొడుకులకు మీ అన్ననను చంపేశాం...రా కావాలంటే ఫొటోలు చూసుకోమని చూపించారు.
ఫలానా చోట చంపామని కూడా చెప్పారు. దీంతో బంధువులు నల్లపాడు పోలీసులకు సమాచారం ఇచ్చారు. శనివారం రాత్రి నల్లపాడు పోలీసులు బత్తుల రవి లాలాపేట పోలీస్ స్టేషన్‌లో రౌడీషీటర్ కావడంతో లాలాపేట పోలీసులు కూడా గాలించారు. ఆదివారం ఉదయం మృతదేహం లభ్యమైంది. నల్లపాడు పోలీసులు రవి తల్లి లక్ష్మి, తండ్రి బత్తుల బాబు వద్ద ఫిర్యాదు తీసుకొని కేసు విచారణ చేస్తున్నారు.
-
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
మార్చి 21 తర్వాత పాకిస్తాన్ ఉండదు- రాసిపెట్టుకోండి: బాంబు పేల్చిన జ్యోతిష్యురాలు -
సిగ్గుండాలి.. అనసూయ ఒక్క పోస్ట్‌తో సైలెన్స్! -
కక్ష్యను మార్చకోనున్న బుధుడు.. ఈ రాశుల జీవితం మారిపోతోంది -
'తల్లికి వందనం’ నిధుల జమ పై ప్రభుత్వం కీలక ప్రకటన, ఇక వారికీ..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
today rashiphalalu: రాహుసూర్యుల శక్తివంతమైన యోగంతో ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు!












Click it and Unblock the Notifications