అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు కష్టం చూసి రూ.1 కోటి విరాళం, గంటాకు షాకిచ్చారిలా.. (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

విజయవాడ/విశాఖ: రాజధాని అమరావతి నిర్మాణానికి మంగళగిరి మండలం నీరుకొండ గ్రామానికి చెందిన 80 ఏళ్ల వృద్ధురాలు స్వరాజ్యం భూరి విరాళం ఇచ్చారు. బుధవారం ఆమె విజయవాడలోని సీఎం కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి రూ.కోటి విలువైన చెక్కును అందజేశారు.

రాష్ట్రం కోసం చంద్రబాబు పడుతున్న కష్టాన్ని చూసి తన కష్టార్జితాన్ని విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు స్వరాజ్యమ్మ తెలిపారు. 40 ఏళ్ల క్రితమే ఆమె భర్త చనిపోగా స్వయంగా వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని లాక్కొచ్చారు. వ్యవసాయంతోనే దీనిని సంపాదించినట్లు వెల్లడించారు. ఆమెను చంద్రబాబు అభినందించారు.

ఇదిలా ఉండగా, విశాఖలో మంత్రి గంటా శ్రీనివాస రావుకు బుధవారం చేదు అనుభవం ఎదురైంది. విశాఖ పోర్టు ట్రస్ట్ వద్ద ఫెర్రీ బోట్ల ప్రారంభోత్సవానికి వెళ్లిన ఆయనను మత్స్యకారులు అడ్డుకున్నారు.

రాజధానికి రూ.కోటి విరాళం

రాజధానికి రూ.కోటి విరాళం

నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం కోసం 80 ఏళ్ల వృద్ధురాలు స్వరాజ్యం ముఖ్యమంత్రి చంద్రబాబుకు భారీ విరాళం ఇచ్చారు.

రాజధానికి రూ.కోటి విరాళం

రాజధానికి రూ.కోటి విరాళం

విజయవాడలో సీంఎంను కలిసిన ఆమె రూ.కోటి విరాళాన్ని అందించారు. స్వరాజ్యం స్వస్థలం గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నీరుకొండ గ్రామం.

రాజధానికి రూ.కోటి విరాళం

రాజధానికి రూ.కోటి విరాళం

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... రాజధాని అమరావతి నిర్మాణానికి విరాళం ఇవ్వాలనిపించిందని, అందుకే సీఎంకు ఇచ్చానని చెప్పారు.

 గంటాకు చేదు

గంటాకు చేదు

విశాఖలో మంత్రి గంటా శ్రీనివాసరావుకు బుధవారం చేదు అనుభవం ఎదురైంది. విశాఖ పోర్టు ట్రస్ట్ వద్ద ఫెర్రీ బోట్ల ప్రారంభోత్సవానికి వెళ్లిన ఆయనను మత్స్యకారులు అడ్డుకున్నారు.

గంటాకు చేదు

గంటాకు చేదు

ఇంటర్నేషనల్ ప్లీట్ రివ్యూ (ఐఎఫ్‌ఆర్‌) కోసం తాత్కాలికంగా ఏర్పాట్లకే అంగీకరించామని, ప్రభుత్వం ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా ఊరుకోబోమని వారు హెచ్చరించారు.

 గంటాకు చేదు

గంటాకు చేదు

అయితే వారి సమస్యలను సావధానంగా విన్న మంత్రి ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఎలాంటి నిర్మాణాలు జరగకుండా చూస్తామని మంత్రి గంటా నచ్చజెప్పడంతో మత్స్యకారులు శాంతించారు. అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించకుండానే మంత్రి వెనుదిరిగారు.

English summary
A senior citizen, Muppavarapu Swarajyam, resident of Neerukonda village of Guntur district, on Wednesday handed over a cheque of Rs 1 crore to Chief Minister N Chandrababu Naidu towards Amaravati capital construction.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X