ఆడవాళ్ళ గురించి తక్కువ మాట్లాడితే దవడ పగిలిపోతుంది: సాదినేని యామిని!!
దేశ రాజధాని ఢిల్లీలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రదర్శనలు నిర్వహించాయి. అయితే ఈసారి గణతంత్ర దినోత్సవ వేడుకలలో నారీ శక్తి పరేడ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది . వికసిత భారత్, భారత్ లోక తంత్రాకి మాతృక అనే రెండు థీమ్ లతో ఈసారి వేడుకలను నిర్వహించారు. ఈ సంవత్సరం నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలలో 13 వేలమంది ప్రత్యేక అతిథులు పాల్గొన్నారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయజెండా ఆవిష్కరించిన తర్వాత రిపబ్లిక్ డే పెరేడ్ నిర్వహించారు. ఈసారి జాతీయ మహిళా శక్తితో పాటు ప్రజాస్వామిక విలువలు ప్రతిబింబించేలా పరేడ్ ను నిర్వహించారు. దేశ భద్రతలో మన నారీ శక్తిని భరతజాతి మొత్తం సగర్వంగా చూసింది. చరిత్రలో తొలిసారిగా అందరూ మహిళలే సభ్యులుగా ఉన్న త్రివిధ దళాలు రిపబ్లిక్ డే పెరేడ్ లో పాల్గొన్నాయి. ఇందులో అగ్ని వీరులు సైతం ఉన్నారు .

ఆవాహన పేరుతో ప్రారంభించిన పరేడ్లో మొదట వందమంది మహిళలు భారతీయ సంగీతాన్ని వినిపించారు. సాంప్రదాయ బ్యాండ్ కు బదులుగా శంఖం, నాదస్వరం, నగరాలతో నారీ శక్తిని ప్రతిబింబించారు. ఆపై మహిళా అధికారులు దీప్తి రానా, ప్రియాంక సేవ్ దా ఆయుధ లొకేషన్ గుర్తింపు రాడార్, పినాక రాకెట్ వ్యవస్థలకు నేతృత్వం వహించారు. మహిళా రక్షణ దళాల కవాతు అందరినీ ఆకట్టుకుంది.
ఇక ఈరోజు రిపబ్లిక్ డే వేడుకలలో మహిళా రక్షణ కవాతు పై ఏపీ బీజేపీ నాయకురాలు సాదినేని యామిని శర్మ ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ఎవడైనా మా ఆడవాళ్ళ గురించి తక్కువ మాట్లాడితే దవడ పగిలిపోతుంది..ఎవడురా భారత మహిళను తక్కువ అనేది? ఈ నారిశక్తి చూస్తే మూర్ఛ రావాల్సిందే అంటూ ఆమె ట్విట్టర్ వేదికగా పోస్ట్ పెట్టారు.
ఎవడైనా మా ఆడవాళ్ళ గురించి తక్కువ మాట్లాడితే దవడ పగిలిపోతుంది..ఎవడురా భారత మహిళను తక్కువ అనేది? ఈ నారిశక్తి చూస్తే మూర్ఛ రావాల్సిందే. CRPF, BSF, SSB నుండి వచ్చిన మహిళా రక్షణ దళాలను చూసి ప్రపంచం నివ్వెర పోతోంది. కుళ్ళుకునే వాళ్ళ కంట్లో కారం కొట్ట..
— Yamini Sharma Sadineni (@YaminiSharma_AP) January 26, 2024
The women bikers from CRPF, BSF,… pic.twitter.com/eIM7otqRY0
CRPF, BSF, SSB నుండి వచ్చిన మహిళా రక్షణ దళాలను చూసి ప్రపంచం నివ్వెర పోతోంది అని సాదినేని యామిని శర్మ పేర్కొన్నారు. కుళ్ళుకునే వాళ్ళ కంట్లో కారం కొట్ట.. అంటూ ప్రపంచం ఈర్ష పడేలా నారీ శక్తి కవాతు జరిగిందని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications